A terrible thing happened in Mumbai. A four-month-old toddler was washed away in a canal by her father
ముంబై(Mumbai)లో ఓ హృదయవిదారకమైన సంఘటన చోటుచేసుకుంది. 4 నెలల పసిబిడ్డ(four-month-old toddler) తండ్రి నుంచి చేజారీ కాలువలో పడి కొట్టుకుపోయింది. మహారాష్ట్ర (Maharashtra)లో భారీ వర్షాల కారణంగా కళ్యాణ్ – ఠాకుర్లి(Kalyan – Thakurli) మధ్య ప్రయాణిస్తున్న లోకల్ రైలును రెండు గంటల పాటు వంతెన మీద నిలిపివేశారు. ప్రయాణికులంతా రైలు ఎప్పుడు కదులుతుందా అని సుదీర్ఘంగా నిరీక్షిస్తూ ఉన్నారు. అంతలో ఓ పసిబిడ్డకు అసౌకర్యంగా ఉందనో ఏమో తన తండ్రి నాలుగు నెలల పసికందును ఆడించేందుకు రైలు దిగారు. పట్టాలు పక్కన అలా ఆడిస్తూ ఉండగా పాప చేతులు పట్టుతప్పి జారి కాలువలో పడిపోయింది. తల్లి కళ్ళ ముందే కాలువలో కొట్టుకుపోయిన బిడ్డ కోసం చేసిన ఆర్తనాదాలు చేసింది. స్థానిక రైల్వే(Railway) సిబ్బంది చాలాసేపు గాలింపు చర్యలు చేపట్టినా కాలువలో వరద ప్రవాహం వేగంగా ఉండటంతో ఫలితం లేకపోయింది.
దేశవ్యాప్తంగా నైరుతి పవనాల(Southwest winds) ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ఉత్తరాదిన అనేక ప్రాంతాలు వర్షాల ఉధృతికి జలమయం కాగా ముంబైలో కూడా వర్షాలు తారాస్థాయికి చేరాయి. గత కొద్ది రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలకు ముంబై అతలాకుతలమైంది. అయినా కూడా జనం జీవనాన్ని యథాతధంగా కొనసాగిస్తూనే ఉన్నారు. ఇక చాలా ఏరియాల్లో వాతావరణ శాక హెచ్చరికలు జారిచేసింది. రెడ్ అలెర్ట్ ప్రకటించింది. ఈ వరదల కారణంగా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ ప్రాంతాల్లో ప్రాణనష్టం కూడా వాటిల్లుతోంది. కొండచరియలు విరిగిపడటంతో జనజీవనానికి ఇబ్బందిగా మారుతోంది.
Tragedy struck as a 4-month-old baby drowned in a nullah after slipping from his father's grasp. The parents had been stranded on a local train between Kalyan and Thakurli &while walking along the tracks, their little one slipped and fell into the nullah. Heartbreaking incident! pic.twitter.com/RAlN2lpPoU