»A Party Celebration Among Animals At Jubilee Hills Xora Night Pub
Xora night Pub: జూబ్లీ హిల్స్ పబ్‌లో జంతువుల మధ్య పార్టీ వేడుక
జూబ్లీ హిల్స్‌లో Xora నైట్ క్లబ్లో వినూత్నంగా జంతువులను బంధించి పార్టీ జరుపుతున్నారు. విషయం తెలిసిన పోలీసులు రంగంలోకి దిగి వన్యప్రాణులను అదుపులోకి తీసుకుని అటవీ అధికారులకు అందించారు.
హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లోని ఓ పబ్‌లో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. Xora నైట్ క్లబ్లో ఏకంగా వైల్డ్ లైఫ్ జంతువులను బంధించారు. అంతేకాదు ఆ వన్యప్రాణుల సమక్షంలో పబ్ నిర్వహిస్తున్నారు. ఆ దృశ్యాలను ఓ వ్యక్తి వీడియో తీసి ఫుటేజ్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా..హైదరాబాద్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ (MA&UD) స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ చూసి వెంటనే స్పందించారు.
ఈ విషయాన్ని పరిష్కరించడానికి ట్విట్టర్లో అధికారులను ట్యాగ్ చేసి @TelanganaDGP @CVanandIPS @TelanganaCOPs, PCCFతో చర్చిస్తున్నట్లు వెల్లడించారు. ఇది అత్యంత అవమానకరమైన, దిగ్భ్రాంతికరమైన చర్య అంటూ అరవింద్ కుమార్ పేర్కొన్నారు. ఇది చూసిన పలువురు నెటిజన్లు అటువంటి వాతావరణంలో జంతువులను బంధించడమెంటని ప్రశ్నిస్తున్నారు. స్పష్టంగా అవి వాటి సహజ ఆవాసాలకు దూరంగా ఉన్నట్లు వీడియోలో కనిపిస్తుంది.
ఈ మెసేజ్‌తో అప్రమత్తమైన జూబ్లీహిల్స్ పోలీసులు ప్రాథమిక విచారణ జరిపారు. అయితే ఆదివారమే జంతువులను ప్రదర్శనకు ఉంచినట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఓల్డ్ సిటీలోని ఓ వ్యక్తి నుంచి వాటిని సేకరించామని నిర్వాహకులు పోలీసులకు చెప్పారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మరో పబ్‌కు కూడా అదే వ్యక్తి జంతువులను సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై అటవీశాఖకు సమాచారం అందించి, పబ్‌పై చర్యలు తీసుకునేందుకు న్యాయపరమైన అవకాశాలను కూడా అన్వేషిస్తామని వెల్లడించారు.