»A New Political Party Is Ramachandra Yadav Starting Today In Ap Tension For Opponents
AP:లో ఈరోజు కొత్త రాజకీయ పార్టీ ప్రారంభం..ప్రత్యర్థులకు టెంన్షన్!
దూరదృష్టి కలిగిన నేత, రాజకీయవేత్త రామచంద్ర యాదవ్(ramachandra yadav) ఏపీ(AP)లో సంచలనం సృష్టించబోతున్నారు. ఈరోజు(జులై 23న) గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో ప్రజా సింహగర్జన బహిరంగ సభలో నూతన రాజకీయ పార్టీని ప్రకటించబోతున్నారు. మరోవైపు ఈ పార్టీ ప్రకటన గురించి ఏపీవ్యాప్తంగా రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
ఏపీలోని చిత్తూరు జిల్లా పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గ బీసీ నాయకుడు, పారిశ్రామికవేత్త బోడే రామచంద్ర యాదవ్(ramachandra yadav) ఏపీ రాజకీయాల్లో(ap politics) పెను మార్పులు తీసుకురాబోతున్నారు. నేడు(జూలై 23న) గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్శిటీ సమీపంలో ప్రజాసింహ గర్జన(praja simha garjana) బహిరంగ సభలో సాయంత్రం 3.45 తర్వాత కొత్త రాజకీయ పార్టీని ఆవిష్కరించనున్నట్లు రామచంద్ర యాదవ్ తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు ప్రధానంగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు “సామాజిక న్యాయం” కోసం ఏపీలో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. రాజకీయ అధికారంతోనే బహుజనుల జీవితాలు వర్ధిల్లుతాయని, సమాజంలోని అసమానతలను అధిగమించేందుకు కొత్త పార్టీని పెడుతున్నట్లు స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్(andhra pradesh)లో రెండు ప్రధాన రాజకీయ పార్టీలు టీడీపీ, వైఎస్సార్సీపీలు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలను కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకుని అభివృద్ధిని విస్మరించాయని రామచంద్ర యాదవ్ ఆరోపించారు. రాష్ట్రంలో బహుజనులకు రాజకీయ అధికారం లేకుండా పోయిందని గుర్తు చేశారు. వైఎస్సార్సీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం రాష్ట్రాన్ని నాశనం చేశాయని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా పలువురు నేతలు ఈ సభకు తరలివచ్చి కొత్త పార్టీ స్థాపనను విజయవంతం చేయాలని కోరారు.
రామచంద్ర యాదవ్(ramachandra yadav) 2019లో రాజకీయాల్లోకి ప్రవేశించి చిత్తూరు జిల్లాలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ అంతటా ప్రజలకు(people) సేవ చేయాలనే బలమైన నిర్ణయంతో దూసుకెళ్తున్నారు. 2019 ఎన్నికల్లో రామచంద్ర యాదవ్ జనసేన నుంచి పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై పోటీ చేసి ఓడినప్పటికీ నియోజక వర్గంలోనే ఉంటూ నిత్యం ప్రజలకు సేవ చేస్తున్నారు. రాజకీయ నాయకుడిగానే కాకుండా ప్రజల మనిషిగా కూడా అనేక కార్యక్రమాలు చేశారు. యువతకు ప్రియమైన సభ్యుడిగా, అతను ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం, సమాజంలోని యువకులకు ఉద్యోగ అవకాశాలను సృష్టించడంపై దృష్టి సారించారు.
రాజకీయ సంబంధ బాంధవ్యాలతో సంబంధం లేకుండా ప్రజలను ఏకతాటిపైకి తీసుకొచ్చి ఉమ్మడి లక్ష్యాల కోసం పని చేసే సామర్థ్యానికి రామచంద్ర యాదవ్ కు మంచి పేరుంది. అతను ప్రభుత్వంలో పారదర్శకత, జవాబుదారీతనానికి అధిక విలువ ఇచ్చాడు. ఎన్నికైన నేతలు తమ నియోజకవర్గాల అవసరాలకు ప్రతిస్పందించవలసి ఉంటుందని ఆయన నమ్ముతారు. ఇటీవల అతను బేషరతుగా సేవలు అందించడం, సమాజంలోని వివిధ వర్గాలకు మద్దతు ఇచ్చిన క్రమంలో రామచంద్ర యాదవ్‌ను భారత్ యువ పురస్కారం(award)తో సత్కరించారు.