ATP: గుత్తి పట్టణంలోని కమటం వీధిలో బుధవారం పాతబాకీ ఇవ్వాలని అడిగిన విషయంలో మాటమాట పెరిగి నాజీయ అనే వివాహితపై అదే కాలనీకి చెందిన వ్యక్తి కత్తితో దాడి చేసి గాయపరిచాడు. ఈ దాడిలో నజియాకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన ఆమెను చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రానికి తరలించారు.