MNCL: రైలులో ప్రయాణిస్తూ గుర్తుతెలియని ఒక వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. మృతుడు దాదర్ ఎక్స్ ప్రెస్ రైలులోని జనరల్ బోగీలో అపస్మారక స్థితిలో ఉండగా మంచిర్యాల రైల్వే స్టేషన్లో దింపారు. వెంటనే 108 అంబులెన్స్‌కు కాల్ చేయగా అక్కడికి చేరుకొని అప్పటికే మరణించినట్లు తెలిపారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ గదిలో భద్రపరిచారు.