ATP: పెద్దవడుగూరు మండలం మిడుతూరు గ్రామ సమీపంలోని 44 హైవేపై శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న రెండు బైక్ లను వెనుక వైపు నుంచి కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో బైకుల మీద ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.