ATP: బుక్కరాయసముద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద గత నెల 26న భారత రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా తహసీల్దార్ శ్రీధర్ మూర్తి అంబేద్కర్ సర్కిల్‌గా నామకరణం చేసి బోర్డును ఏర్పాటు చేశారు. ఎవరో గుర్తు తెలియని దుండగులు ఆదివారం రాత్రి నామకరణం చేసిన బోర్డును ఎత్తుకెళ్లారు. బోర్డు ఎత్తుకెళ్లిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.