TG: రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్, నల్గొండ, మంచిర్యాల జిల్లాల పరిధిలో భూప్రకంపనలు వచ్చాయి. హైదరాబాద్లోని వనస్థలిపురం, హయత్నగర్తో పాటు అబ్దుల్లాపూర్మెట్లో భూమి కంపించింది. మణుగూరు, భద్రాచలం, చర్ల, చింతకాని, నాగులవంచ మండలాల్లో భూమి కంపించింది. కొత్తగూడెంలో ఉదయం 7:27 గంటలకు 3 సెకన్ల పాటు, ములుగులో అత్యధికంగా రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి.