ATP: బ్రహ్మసముద్రం మండలం తిప్పయ్య దొడ్డి గ్రామానికి చెందిన గొల్ల బేబీ(26) ఆదివారం సాయంత్రం తన ఇంటి ముందర ఉన్న జొన్న పొట్టును పొయ్యి వెస్తేందుకు వెళ్లింది. జొన్న పొట్టు తీస్తుండగా ఆమె ఎడమ కాలుకు పాము కాటు వేసింది. ఆమెను అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మరణించింది. దీనిపై బ్రహ్మసముద్రం ఎస్సై నరేంద్ర కుమార్ కేసు నమోదు చేసి వివరాలు తెలిపారు.