KNR: మొగ్దుంపూర్ వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై ఇద్దరు వ్యక్తులు కరీంనగర్ వైపు వెళ్తుండగా.. ఓ లారీ అకస్మాత్తుగా యూటర్న్ తీసుకుంది. దీంతో వారు లారీని వెనుకనుంచి ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో చెన్నూర్‌కు చెందిన సాగర్ మృతిచెందారు. దండేపల్లి మండలం కన్నేపల్లికి చెందిన శ్రీనుకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని 108కి సమాచారమిచ్చి ఆసుపత్రికి తరలించారు.