భువనగిరి – చిట్యాల ప్రధాన రహదారిపై న్యూ డైమెన్షన్ స్కూల్ సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. లూనాపై వెళ్తున్న వ్యక్తిని బస్సు ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందాడు. మృతుడు అనాజిపురానికి చెందిన కల్లు గీత కార్మికుడిగా గుర్తించారు. అతను భువనగిరి వైపు వెళ్తుండగా వెనుక నుంచి అతివేగంతో ఆర్టీసీ బస్సు ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు.