గూగుల్ మ్యాప్ ఫాలో అవుతూ కారు నడుపుకుంటూ వెళ్లిన వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. గూగుల్ సందేశాలను అనుసరిస్తూ వెళ్లిన కారు కెనాల్లో పడిపోయింది. ఈ సంఘటన యూపీలోని రాయ్‌బరేలీ- పిలిభిత్ రహదారిపై జరిగింది. కాగా కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు ఎలాంటి హాని జరగలేదు. సమాచారం తెలుసుకున్న అధికారులు ఓ క్రేన్‌ను తీసుకువచ్చి కాలువలో పడిపోయిన కారును బయటకి తీశారు.