KDP: ప్రొద్దుటూరు పట్టణంలోని బీజీఆర్ బార్ అండ్ రెస్టారెంట్లోని రూం నెంబర్ 206లో గత రాత్రి యువకుడి తల బద్దలు కొట్టి దారుణ హత్య చేశారు. గత రాత్రి కొంత మంది యువకులు బార్లో రూము తీసుకున్నారని, రాత్రి మద్యం సేవించి గొడవ పడ్డారని, ఉదయం చూసేసరికి ఒకరు హత్యకు గురయ్యారని లాడ్జి సిబ్బంది తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.