AP: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భూకంపం వచ్చింది. విజయవాడ, రాజమండ్రి, జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు, గుడివాడ, మంగళగిరి సహా పలు ప్రాంతాల్లో 2 సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అలాగే, తెలంగాణలో 20 ఏళ్ల తర్వాత 5.3 తీవ్రతతో భూకంపం వచ్చింది. భూమి లోపల 40 కి.మీ. నుంచి రేడియేషన్ ఉద్భవించినట్లు అధికారులు వెల్లడించారు. మీ ప్రాంతంలో కూడా భూకంపం వచ్చిందా? కామెంట్ చేయండి.