BPT: కొరిశపాడు మండలం పమిడిపాడు శివారు వద్ద చెక్ డ్యామ్‌లో ముగ్గురు పిల్లలు ఈతకు దిగారు. ఈ క్రమంలో వారిలో ఒకరు గల్లంతవగా, మిగిలిన పిల్లల సమాచారంతో గ్రామస్తులు, వారి తల్లిదండ్రులు చెరువు వద్దకు చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ సంఘటన సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.