బాపట్ల: అద్దంకి మండలం చక్రాయపాలెం వద్ద ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని మరొక లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా స్థానికులు చెప్పారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ పి శ్రీను, క్లీనర్ పి లక్ష్మీనారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు 10 8అంబులెన్స్‌లో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది