HYD: రాయదుర్గం PS పరిధిలో శివాని అనే యువతి రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. పోలీసులు తెలిపిన వివరాలు.. CBITలో బీటెక్ 4వ ఏడాది చదువుతున్న శివాని నిజాంసాగర్‌లో పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వెళ్లి వచ్చింది. హాస్టల్‌కు వెళ్లేందుకు స్నేహితుడు వెంకట్ రెడ్డి బైక్ పై నార్సింగి సర్వీస్ రోడ్డులో వెళ్తుండగా కారు ఢీకొట్టింది.