కజకిస్థాన్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. అక్తౌ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో 72 మంది మృతి చెందినట్లు సమాచారం. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా, ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.