NRML: వాహన ప్రమాదంలో నీలుగాయి మృతి చెందిన ఘటన బుధవారం దిలావర్పూర్ మండలంలో జరిగింది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మీనా వివరాల మేరకు కుంటాల మండలం కల్లూరు నుండి నిర్మల్‌కు ప్రయాణిస్తున్న ఓ కారు లోలం-సిర్గాపూర్ అటవీ ప్రాంతంలో ఎదురుగా వస్తున్న నీలుగాయిని ఢీకొట్టగా అక్కడికక్కడే మృతి చెందిందని తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం వెటర్నరీ వైద్యుడికి సమాచారం అందించామన్నారు.