KMM: ఎటపాక మండలం రాయనిపేట వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం కారు- బైక్ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో బైక్ డ్రైవర్‌కి తీవ్ర గాయాలయ్యాయి. బైక్ పై ఉన్న వ్యక్తి సగం కాలు తెగి రోడ్డుపై పడింది. అటుగా వెళ్తున్న ప్రయాణికులు 108కు సమాచారం ఇవ్వడంతో క్షతగాత్రుడిని భద్రాచలం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.