RR: నాగోల్‌లో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జీడిమెట్ల సుభాష్ నగర్‌కు చెందిన బండారి విజయ్ కుమార్ (35) రాత్రి 11:45కు నాగోల్‌లోని ఓ పెట్రోల్ బంక్ వద్ద బైక్‌పై నిలుచున్న సమయంలో వేగంగా వచ్చిన లారీ అతన్ని ఢీకొట్టింది. దీంతో తీవ్రమైన గాయాలు అయ్యాయి. తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.