NLG: దేవరకొండ పట్టణం గుండా వెళ్లే జడ్చర్ల-కోదాడ జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని 2 గేదెలు మృతి చెందాయి. ఇవాళ తెల్లవారుజామున వెంకటేశ్వర థియేటర్ ముందు ఈ ప్రమాదం జరిగింది. థియేటర్ సమీపంలో సూక్ష్మ మూలమలుపు ఉండడంతో రాత్రి వేళల్లో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. వాహనాల వేగ నియంత్రణకు తక్షణమే ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.