NLR: కావలి మండలం మద్దురుపాడు లారీ స్టాండ్ వద్ద మూడు లారీలను కావలి వన్ టౌన్ పోలీసులు పట్టుకున్నారు. వాటిలో సుమారు 600 అక్రమ రేషన్ బియ్యం బస్తాలు ఉన్నాయి. దీనిపై ఎస్ఐ సుమన్‌ను వివరణ కోరగా, ఆయన తమకు రాబడిన సమాచారం మేరకు దాడులు నిర్వహించామన్నారు. మూడు అశోక్ లేలాండ్ లారీలను పట్టుకోగా వాటిలో సుమారు 600 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం తెలిపారు.