ఖమ్మం రూరల్ మండలం M.V పాలెం కోల్డ్ స్టోరేజ్ వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. రోడ్డుపై అతివేగంగా వెళ్తున్న ఒకరు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికీ గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.