ఇజ్రాయెల్, హెజ్బొల్లాల మధ్య దాడులు కొనసాగుతున్నాయి. మరోవైపు లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో మృతుల సంఖ్య 560కి చేరుకుంది. మృతుల్లో 50 మంది పిల్లలు, 94 మంది మహిళలున్నారు. నలుగురు వైద్య సిబ్బంది మరణించగా.. 16 మంది గాయపడ్డారు. దాడుల్లో మొత్తం 1,835 మంది గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్యశాఖ మంత్రి ఫిరాస్ అబియాద్ వెల్లడించారు. 54 ఆస్పత్రుల్లో వారికి చికిత్స జరుగుతోందని వివరించారు.