ATP: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన రాయదుర్గం మండలంలో జరిగింది.సిద్దేశ్వర కాలనీకి చెందిన బొమ్మన్న(45)శనివారం పెదాగుడ్డం వద్ద పొలంపనికి వెళ్లి బైక్ పై తిరిగి వస్తుండగా అకస్మాత్తుగా పంది అడ్డువచ్చింది. దీంతో అతడు అదుపు తప్పి బైక్పై నుంచి కిందపడినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే అతడిని రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందాడు.