ప్రకాశం: కనిగిరి మున్సిపాలిటీ మాచవరం పరిధి బీసీ కాలనీలో పేకాట ఆడుతున్న నలుగురిని ఎస్సై తుళ్లూరు శ్రీరామ్ తన సిబ్బందితో కలిసి అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారి వద్ద నుంచి రూ.24,950 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే చర్యలు తప్పవని, అటువంటి పనులపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.