GNTR: నరసరావుపేటలోని అచ్చమ్మపాలెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తిరుమల శెట్టి శ్రీనివాసరావు (26) మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వినుకొండ నుంచి చీరాల బీచ్‌కి ద్విచక్ర వాహనంపై మద్యం సేవించి అతివేగంగా వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న నరసరావుపేట రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.