తమిళనాడులో ఓ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కొంతమంది యాత్రికులు తిరుచెందూర్లోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఉలుందూర్పేట శివారులోకి చేరుకోగానే వారు వెళ్తున్న మినీ వ్యాన్ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలతో సహా ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణం అతివేగమే కారణమని పోలీసులు గుర్తించారు.