WG: తాడేపల్లిగూడెం మండలం మెట్ట ఉప్పరగూడెం ఊర చెరువులో గేదెలను కడిగేందుకు దిగి యాదాల దేశాలు (45) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు మృతిచెందాడు. స్థానికులు వెంటనే చెరువులోకి దిగి కాపాడే ప్రయత్నం చేశారు. అప్పటికే దేశాలు మృతి చెందాడని అతని తండ్రి సంతోషం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.