BHNG: బ్యాంకులో నగదు డ్రా చేసేందుకు వెళ్లిన యువకుడు అదృశ్య మయ్యాడు. సీఐ మన్మథకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. తంగడపల్లికి చెందిన ఎండీ సమీర్ చౌటుప్పల్లో నగదు డ్రా చేసేందుకు శుక్రవారం ఇంటి నుంచి వెళ్లాడు. కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. మిత్రులు, బంధువుల ఇళ్లలో వాకబు చేసినా ఆచూకీ లభించలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.