చండీగఢ్ ఎయిర్ పోర్టులో బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ను చెప్పుతో కొట్టిన ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కుల్విందర్ కౌర్ కేసు మరింత ఊపందుకుంది.
జమ్ముకశ్మీర్‌లోని రియాసిలో జూన్ 9న భక్తులతో నిండిన బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ఇప్పటి వరకు 10మంది మృతి చెందగా, 33 మంది గాయపడ్డారు. బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.
ఆదివారం రాష్ట్రపతి భవన్లో ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే, మరో 71 మంది ఎన్డీయే ఎంపీలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
సిక్కిం ముఖ్యమంత్రిగా సిక్కిం క్రాంతికారి మోర్చా (ఎస్‌కెఎం) శాసనసభా పక్ష నేత ప్రేమ్‌సింగ్ తమాంగ్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు.
జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను కర్ణాటక కోర్టు జూన్ 24 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. అసభ్యకర వీడియో కేసులో ఇరుక్కున్న రేవణ్ణను మే 31న పోలీసులు అరెస్ట్ చేశారు.
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సోమవారం (జూన్ 10) న్యూఢిల్లీలో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో సమావేశమయ్యారు.
మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. సోమవారం (జూన్ 10) జరిగిన ఈ దాడిలో ఒక సైనికుడు గాయపడ్డాడు. మిలిటెంట్లు కాంగ్పోక్పి జిల్లాలో మెరుపుదాడి చేశారు.
ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో ఘఘ్రా నదిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు గల్లంతయ్యారు. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.
నరేంద్ర మోడీ జూన్ 9న మూడవసారి ప్రమాణ స్వీకారం చేసి ప్రధానమంత్రి బాధ్యతలను స్వీకరించారు. ఆయనతో పాటు 71 మంది ఎంపీలు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.
దేశ 18వ లోక్‌సభకు ఎన్నికలు పూర్తయ్యాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పేరొందిన భారతదేశంలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్న తీరుపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.