నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆదివారం రాత్రి 9 గంటల నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. నగర పరిధిలోని పబ్‌లు, బార్లు, రిసార్ట్‌ల వద్ద పోలీసులు గట్టి నిఘా పెట్టారు.
ఏపీలోఅంగన్వాడీ జీతాలు పెంచాలని కార్యకర్తలు సమ్మె చేస్తున్నారు. ప్రస్తుతం 21వ రోజు సమ్మె జరుగుతోంది. ఈక్రమంలో కార్యకర్తలు మాట్లాడుతూ.. జీతాలు పెంచకపోతే ఈసారి రాష్ట్రంలో వైసీపీ అడ్రస్ లేకుండా చేస్తామని వ్యాఖ్యనించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి APPSC ద్వారా వివిధ ఉద్యోగ ప్రకటనలను విడుదల చేసింది. కాగా, డిసెంబర్ చివరి నెలలో ఏకకాలంలో ఏడు ఉద్యోగ ప్రకటనలు విడుదలయ్యాయి.
భారతదేశంలో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు అనేక సబ్ వేరియంట్ JN.1 కేసులు నమోదయ్యాయి. అయితే, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటాలో సోమవారం కరోనా కేసులలో కొంచెం తగ్గుదల కనిపించింది.
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీతి సింగ్ త్వరలో వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే నెల ఫిబ్రవరిలో గోవాలో తన ప్రియుడితో కుటుంబ సభ్యుల సమక్షంలో చేసుకోబోతున్నట్లు సమాచారం.
సింగర్ సునీత తనయుడు ఆకాశ్ హీరోగా నటించిన చిత్రం సర్కారి నౌకరి. కొత్త ఏడాది మొదటిరోజున ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి మొదటి సినిమాతో ఆకాశ్ హిట్ కొట్టాడో లేదో తెలుసుకుందాం.
జపాన్‌లో సంభవించిన భారీ భూకంపం సంభవించింది. ఉత్తర మధ్య జపాన్‌లో రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని తరువాత, వాతావరణ సంస్థ ఇషికావా, నీగాటా, టొయామా ప్రిఫెక్చర్ల తీర ప్రాంతాలలో సునామీ హెచ్చరికను జారీ చేసింది.