30 ఏళ్లు దాటిన వారు విధిగా బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఒత్తిడి ఎక్కువ అవుతుందా..? అయితే కూల్‌గా ఉండమంటున్నారు వైద్య నిపుణులు. ప్రశాంతంగా యోగా.. లేదంటే ఏరోబిక్ వ్యాయామాలు చేయాలని సూచిస్తున్నారు.
భారత్‌లో టాప్ 5 మొబైల్ సేల్స్‌లో శామ్ సంగ్ ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. ఆ తర్వాత వివో, షియోమీ, రియల్ మీ, ఒప్పొ ఉన్నాయి. దేశంలో ఐఫోన్ కొనుగోళ్లు ఆశించిన స్థాయిలో లేవు.
ఆటో నడుపుతూ ఇంటిని పోషిస్తూనే.. భార్యను ఉన్నత చదువు చదివించాడు. ఆమెతో పీహెచ్డీ చేయించి, ఉన్నత స్థాయిలో నిలిపాడు గుంటూరుకు చెందిన కరుణాకర్. అతని మంచితనాన్ని పలువురు కొనియాడుతున్నారు.
ఏపీ మంత్రి రోజా భర్త ఆర్కే సెల్వమణికి చెన్నై జార్జ్ టౌన్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేసింది. పరువునష్టం కేసులో విచారణకు హాజరుకాకపోవడంతో ఇష్యూ చేసింది.
పిల్లలు స్కూల్‌కి అకారణంగా డుమ్మా కొట్టడంతో సౌదీ అరేబియా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. 20 రోజులు.. అంతకన్నా ఎక్కువ రోజులు స్కూల్‌కి రాకుంటే ఆ పేరంట్స్‌ను జైలుకు పంపిస్తామని స్పష్టంచేసింది.
వివో తన కొత్త మోడల్‌ను రిలీజ్ చేసింది. వివో వీ 29 ఈ పేరుతో మార్కెట్లోకి వచ్చింది. రెండు వేరియంట్స్‌లో వచ్చే మొబైల్ ధర రూ. 27 వేల నుంచి రూ.29 వేల వరకు ఉంది.
ఆంధ్రా ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లో రాయలసీమ కింగ్స్ జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఎమ్మెల్సీ పళ్లా రాజేశ్వర్ రెడ్డి సొంత సోదరిని మోసం చేశారని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలల్లో సెల్ ఫోన్ల వినియోగంపై సర్కార్ నిషేధం అమలులోకి తెచ్చింది.