NDL: కొలిమిగుండ్ల జడ్పీ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో నేటి నుంచి రాయలసీమ స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు నాగకుళాయి, రమణ ఓ ప్రకటనలో తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న ఈ పోటీల్లో వరుస బహుమతులుగా రూ. 25,116, రూ. 15,116, రూ.10,116 అందించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు.
KDP: రాజంపేటలో పెట్రోల్, డీజిల్ కొరతపై సబ్ కలెక్టర్ హెచ్.యస్. భావన ఐఏఎస్ స్పందించారు. స్థానికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల సమస్యలను తెలుసుకుని, వెంటనే పెట్రోల్ బంకులకు చేరుకుని సరఫరా పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా కొంతకాలం ఇంధన సరఫరాలో అంతరాయం వచ్చినప్పటికీ, ఇది తాత్కాలికమేనని ఆమె తెలిపారు.
అన్నమయ్య: మదనపల్లిలో నూతన టమాటా మార్కెట్ యార్డ్ ఏర్పాటు కోసం అధికారులు పలు ప్రాంతాల్లో స్థలాలను పరిశీలించారు. సుమారు 50 ఎకరాల స్థలం అవసరమని భావిస్తూ బైపాస్ రోడ్, శాంటోరియం సమీపం, పోతుబోలు రోడ్ ప్రాంతాలను పరిశీలించారు. రైతులు, వ్యాపారులకు అనుకూలంగా రవాణా సౌకర్యాలు ఉన్న ప్రదేశాన్ని ఎంపిక చేయాలని నిర్ణయించారు. నివేదిక త్వరలో ప్రభుత్వానికి పంపనున్నారు అధికారులు.
వేమూరు మండలం, జంపని గ్రామంలోని శ్రీ భూ సహిత శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో మోహిని ఏకాదశి పర్వదినం సందర్భంగా ఇవాళ ఉదయం అరుదైన ఆధ్యాత్మిక దృశ్యం కనిపించింది. ఉదయ సూర్యకిరణాలు మూలవిరాట్ స్వరూపమైన స్వామివారి విగ్రహాన్ని పాదాల నుంచి కిరీటం వరకు తాకాయి. ఈ సందర్భంగా స్వామివారి ప్రతి అంగం సూర్య కాంతిలో ప్రకాశించింది. ఈ దృశ్యాన్ని దర్శించిన భక్తులు భక్తి పరవశంలో మునిగిపోయారు.
VSP: మధురవాడ, మారికవలస ప్రాంతాల్లో పలుచోట్ల పెట్రోల్ బంకులు మూతపడటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న కొమ్మాది బంక్ వద్ద ఇవాళ భారీగా క్యూలు కనిపించాయి. గంటల తరబడి వేచి ఉండాల్సి రావడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సరఫరా లోపం కారణమని సిబ్బంది చెబుతున్నారు. అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.
WG: ‘మే’ డేను వాడవాడలా కార్మికులు ఘనంగా నిర్వహించుకోవాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కోనాల భీమారావు పిలుపునిచ్చారు. ఆదివారం తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఏపీ మెడికల్ కాంటాక్ట్ వర్కర్స్ యూనియన్ సమావేశంలో భీమారావు మాట్లాడారు. ‘మే’ డే ఉద్యమ పోరాట స్ఫూర్తితో మోదీ ప్రభుత్వం రద్దు చేసిన 29 కార్మిక చట్టాల పునరుద్ధరించాలని కోరారు.
W.G: నరసాపురం నుంచి హైదరాబాద్ (చర్లపల్లి) వరకు నడిచే నూతన వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను ఆదివారం ప్రారంభించారు. కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కొత్త రైలు అందుబాటులోకి రావడంతో ప్రయాణికులకు రవాణా సౌకర్యం మరింత మెరుగుపడనుందని ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలని మంత్రి అన్నారు.
NDL: ప్యాపిలి మండలం పోతుదొడ్డిలో కోడి పందేల నిర్వాహకులను ఆదివారం సాయంత్రం ఎస్సై నాగార్జున అరెస్టు చేశారు. గ్రామానికి చెందిన రవికుమార్, మునుగుల రామాంజనేయులు, నాగప్ప, రామకృష్ణ తదితరులు గ్రామ శివారు ప్రాంతంలో కోడి పందేలు నిర్వహిస్తుండటంతో అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుల నుంచి 8 బైక్లు, 4 కోడి కత్తులు, 3 పందెం కోళ్లను స్వాధీనం చేసుకున్నామున్నారు.
కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని సబ్‌డివిజన్‌లు, పోలీస్ స్టేషన్ల పరిధిలలో రాత్రివేళల్లో పోలీసులు విస్తృతంగా విజిబుల్ పోలీసింగ్, తనిఖీలు చేపడుతున్నారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు రాత్రిగస్తీ, తనిఖీలు, అనుమానిత వ్యక్తుల ఫింగర్ ప్రింట్ చెకింగ్‌లు, స్టాప్, వాచ్ అండ్ గో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
అన్నమయ్య: జిల్లాలో డీజిల్, పెట్రోల్ సరఫరాకు ఎలాంటి కొరత లేదని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో తాత్కాలిక అంతరాయాలు ఉన్నప్పటికీ అవి నియంత్రణలోనే ఉన్నాయని చెప్పారు. బ్లాక్ మార్కెటింగ్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరానికి మించి ఇంధనం కొనుగోలు చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
KDP: చెన్నూరులోని వీరబ్రహ్మేంద్రస్వామి వారి గ్రామోత్సవం ఆదివారం రాత్రి జరిగింది. కార్యక్రమంలో భాగంగా కోలాటం నిర్వహించారు. చెన్నూరులో నిర్వహించిన కోలాట ప్రదర్శన ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. సాంప్రదాయ దుస్తుల్లో మహిళలు, యువతులు సమూహాలుగా పాల్గొని కోలాటం ఆడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కోలాట బృందానికి చెన్నూరులో మంచి గుర్తింపు లభించింది.
W.G: నరసాపురం శ్రీ వైఎన్ కళాశాల పాలకవర్గ (గవర్నింగ్ బాడీ) ఎన్నికల్లో ప్రముఖ సినీ గేయ రచయిత చేగొండి అనంత శ్రీరామ్ పాల్గొని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆదివారం జరిగిన ఈ ఎన్నికలకు ఆయన కళాశాల పూర్వ విద్యార్థిగా హాజరైన తాను చదువుకున్న విద్యాసంస్థ అభివృద్ధి ప్రక్రియలో భాగస్వామిని కావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
NLR: కావలి రూరల్ బుడంగుంట కాలనీకి చెందిన తురకా రమణమ్మపై అల్లుడు చల్లా శ్రీనివాసులు కూరగాయలు కత్తితో దాడి చేశాడని ఫిర్యాదు రావడంతో ఎస్సై బాజీ బాబు సోమవారం కేసు నమోదు చేశారు. తన భార్య తనతో కాపురానికి రాలేదని శ్రీనివాసులు అత్తపై దాడి చేశాడు. రమణమ్మ ఏరియా ఆసుపత్రిలో ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
KKD: అన్నవరం దేవస్థానంలో నిర్వహించే పూజలు, ఆర్జిత సేవలు, అలంకారాలను ఆన్‌లైన్ చేయాలని దేవాదాయ కమిషనర్ రామచంద్రమోహన్ ఆదేశించారు. భక్తులకు సమాచారం వేగంగా చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ప్రక్రియను రాజమండ్రి రీజనల్ జాయింట్ కమిషనర్ పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. దీనివల్ల భక్తులకు సేవల బుకింగ్ సులభతరం కావడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
VZM: రాజాంలోని బొబ్బిలి సెంటర్‌లో యాదవుల వీధి దగ్గర ఆదివారం సాయంత్రం యువకుల మధ్య తలెత్తిన ఘర్షణలో ఇద్దరు గాయపడ్డారు. వీరిని కుటుంబ సభ్యులు స్థానిక ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని అక్కడ జానాలను చెదరగొట్టి పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఘర్షణకు గల కారణలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.