• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

వైభవంగా వాసవి జయంతి వేడుకలు

CTR: శాంతిపురం మండలం రాళ్లబూదుగూరులో కొలువైన శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో వాసవి జయంతి వేడుకలను ఆదివారం వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి విశేష అలంకరణలో ప్రత్యేక పూజలు చేశారు. ఆర్యవైశ్యులు గ్రామ పురవీధుల్లో అమ్మవారి శోభాయాత్ర వేడుకలు ఘనంగా చేపట్టారు. వాసవి జయంతి సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

April 27, 2026 / 06:59 AM IST

నేడు ఈ మండలాల వారు జాగ్రత్త..!

కడప జిల్లాలో సోమవారం భానుడు నిప్పులు కురిపించనున్నాడు. మైదుకూరులో అత్యధికంగా 44.4°C నమోదవుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దువ్వూరు 43.9°C, అవధూత కాశినాయన 43.5°C, రాజుపాలెం 43.4°C, ప్రొద్దుటూరు 42.9°C ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని తెలిపింది. మధ్యాహ్నం 12 నుంచి 4 వరకు బయటకు వెళ్లొద్దన్నారు.

April 27, 2026 / 06:47 AM IST

రోడ్డుపై లారీ అడ్డు.. భారీగా ట్రాఫిక్ జామ్

NLR: నెల్లూరు నగర సమీపంలోని వెంకటేశ్వరపురం ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ఆదివారం రాత్రి భారీగా ట్రాఫిక్ స్తంభించింది. నెల్లూరు నుంచి కడప వైపు వెళ్లే వాహనాలు కడప నుంచి నెల్లూరుకు వచ్చే వాహనాలతో రద్దీ ఏర్పడింది. ఓ లారీ అడ్డుగా రావడంతో ఇరువైపులా వాహనాలు భారీగా ఆగిపోయాయి. రోజు ఇలానే ట్రాఫిక్‌తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు తెలిపారు.

April 27, 2026 / 06:47 AM IST

తాగి వాహనాలు నడిపితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది: SI

VZM: మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్ష విధిస్తామని బొండపల్లి SI యూ.మహేష్ హెచ్చరించారు. ఆదివారం రాత్రి బొండపల్లి PS పరిధిలో NH పై వాహనాలు తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా వాహనాల రికార్డులు పరిశీలించి అనంతరం డ్రంకెన్‌ డ్రైవ్‌ టెస్టులు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. వాహనదారులు ఎవరు మద్యం తాగి వాహనాలు నడపరాదని, దీంతో అనేక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అన్నారు.

April 27, 2026 / 06:45 AM IST

నేటితో ముగుస్తున్న ఫీజు చెల్లింపు గడువు: ఆర్ఐవో

KRNL: ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లించేందుకు ఇవాళే(సోమవారం) నేటితో గడువు ముగుస్తున్నట్లు ఆర్ఐవో లాలేప్ప ఓ ప్రకటనలో తెలిపారు. జూనియర్ కాలేజీల ప్రిన్సిపళ్లు ఇంకా ఫీజు చెల్లించని విద్యార్థులకు వెంటనే సమాచారం అందించి ఇవాళ ఫీజులు చెల్లించేలా చూడాలని సూచించారు. గడువు తర్వాత ఎలాంటి పొడిగింపు ఉండదన్నారు.

April 27, 2026 / 06:42 AM IST

‘మార్కాపురంలో 16 పెట్రోల్ బంకులు’

మార్కాపురం మండలంలో 16 పెట్రోల్ బంక్‌లు ఉన్నట్లు రెవెన్యూ అధికారులు ఆదివారం తెలిపారు. పట్టణంలో 14, అందులో 3 బంక్‌లు పనిచేయట్లేదన్నారు. అలాగే మండల పరిధిలో 4 అవి రాయవరం, గజ్జలకొండ, చింతగుంట్ల, వేములకోటలో ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికే అధికారులు పెట్రోల్, డీజిల్ కొరతపై అప్రమత్తమై, అన్నిచోట్ల పర్యవేక్షిస్తున్నారన్నారు.

April 27, 2026 / 06:39 AM IST

బహ్రెయిన్‌‌లో మృతి చెందిన యువతి

WG: ఉపాధి కోసం వెళ్లిన చోట ఓ యువతి విగతజీవిగా మారడంతో చిట్టవరంలో విషాదం నిండింది. గ్రామానికి చెందిన వర్ధనపు కవిత (24) నాలుగు నెలల క్రితమే బహ్రెయిన్‌కు వెళ్లింది. అయితే, ఈ నెల 23న ఆమె తాను ఉంటున్న గదిలో ఉరివేసుకుని మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. చేతికందిన కూతురు తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

April 27, 2026 / 06:38 AM IST

నేడు పిఠాపురంలో ‘PGRS’ కార్యక్రమం

KKD: పిఠాపురం పాడా (PADA) కార్యాలయంలో సమస్యలపై ఇవాళ PGRS కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పాడా పీడీ శివరామ ప్రసాద్ తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో నియోజకవర్గ, మండల స్థాయి అధికారులు పాల్గొని అర్జీలు స్వీకరిస్తారని ఆయన పేర్కొన్నారు. రాలేని వారు వెబ్‌సైట్లో కూడా నమోదు చేసుకోవచ్చని సూచించారు.

April 27, 2026 / 06:34 AM IST

అవసరానికి మించి పెట్రోల్ నిల్వ చేసుకోవద్దు: మంత్రి

శ్రీకాకుళం, మన్యం, కోనసీమ జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ఆదివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ మేరకు 3 జిల్లాల్లో పెట్రోల్, డీజిల్ సరఫరా పరిస్థితులపై సమీక్షించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. అవసరానికి మించి ఇంధనం కొనుగోలు చేసి నిల్వ ఉంచుకోవద్దని ప్రజలను కోరారు.

April 27, 2026 / 06:30 AM IST

నేడు నగరపాలక కార్యాలయంలో పీజీఆర్ఎస్

చిత్తూరు: నగరపాలక కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం జరుగుతుందని కమిషనర్ నరసింహ ప్రసాద్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరిస్తామని పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

April 27, 2026 / 06:29 AM IST

నేటి నుంచి పెంచలకోనలో వార్షిక బ్రహ్మోత్సవాలు

నెల్లూరు: రాపూరు మండలం పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను సోమవారం నుంచి నిర్వహించనున్నారు. మే మూడవ తేదీ వరకు స్వామివారు ప్రతిరోజు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారని ఆలయ నిర్వహకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయన్నారు. భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకోవాలన్నారు.

April 27, 2026 / 06:26 AM IST

ఆక్వా రైతులకు ఊరట

WG: జిల్లాలో రాబోయే 48 గంటల పాటు ఎలాంటి విద్యుత్ కోతలు ఉండవని కలెక్టర్ చదలవాడ నాగరాణి స్పష్టం చేశారు. థర్మల్ కేంద్రాల్లో ఉత్పత్తి మళ్లీ ప్రారంభం కావడంతో విద్యుత్ సరఫరా సాధారణ స్థితికి చేరుకుందన్నారు. డీజిల్ కొరత లేదని, రైతులు ఆందోళనతో ముందే భారీగా డీజిల్ నిల్వ చేసుకోవద్దని సూచించారు. ప్రజలు అపోహలు నమ్మవద్దని, అధికార యంత్రాంగానికి సహకరించాలని కోరారు.

April 27, 2026 / 06:26 AM IST

‘నేటి నిరాహార దీక్షను విజయవంతం చేయండి’

PPM: ఉపాధ్యాయుల, ఉద్యోగుల ఆర్థిక ఆర్థికేతర సమస్యల సాధనకై విజయవాడ ధర్నా చౌక్ వద్ద చేస్తున్న నిరాహార దీక్షను ఇవాళ విజయవంతం చేయలంటూ ఫ్యాప్టో నేతలు కోరారు. దీనికి సంబంధించి ఈ నెల 25, 26 తేదీలలో నిరాహార దీక్షలు విజయవంతం అయ్యాయని మన్యం జిల్లా ఫ్యాప్టో నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొంటారని తెలిపారు.

April 27, 2026 / 06:25 AM IST

అయ్యప్ప స్వామి ఆలయం ప్రారంభం

AKP: ఎస్ రాయవరంలో కొత్తగా నిర్మించిన అయ్యప్ప స్వామి ఆలయాన్ని ఆదివారం ప్రారంభించారు. అలాగే అయ్యప్ప స్వామి, గణపతి, సుబ్రమణ్య స్వామి, తదితర దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్టించారు. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి, శబరిమలై ఆలయ పూజారి రిజ్ కుమార్ పాల్గొని అయ్యప్ప స్వామికి పూజలు చేశారు. భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు.

April 27, 2026 / 06:22 AM IST

పాయకరావుపేట సీఐ అప్పన్న బదిలీ

AKP: పాయకరావుపేట సీఐ అప్పన్న బదిలీ అయ్యారు. ఆయనను వీఆర్‌కు బదిలీ చేస్తూ ఆదివారం డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. 2024 సెప్టెంబర్‌లో అప్పన్న పాయకరావుపేట సీఐగా బాధ్యతలు చేపట్టారు. 19 నెలలు పాటు ఆయన ఇక్కడ సీఐగా పనిచేశారు. విధి నిర్వహణలో సహకరించిన వారందరికీ అప్పన్న కృతజ్ఞతలు తెలిపారు. ఆయన స్థానంలో వీఆర్‌లో ఉన్న ఎస్ శంకరరావును సీఐగా నియమించారు.

April 27, 2026 / 06:21 AM IST