WG: నరసాపురం ప్రధాన కాలువలోకి ఆదివారం నీటిపారుదలశాఖ అధికారులు నీరు విడుదల చేశారు. వేసవిలో కాలువ పనుల నిమిత్తం నిలిపివేసిన నీటిని తిరిగి వదలడంతో ఖరీఫ్ సీజన్ పంటలకు సమృద్ధిగా సాగునీరు అందుతుందని డిఈఈ సిహెచ్. వెంకటనారాయణ తెలిపారు. అలాగే ఈ నీటి విడుదలతో పాలకొల్లులో గత కొన్ని రోజులుగా వేధిస్తున్న తాగునీటి సమస్య కూడా పూర్తిగా తీరుతుందని ఆయన పేర్కొన్నారు.
NTR: జగ్గయ్యపేటఎస్‌జీఎస్ కళాశాలను ఆదివారం ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ మున్సిపల్ ఛైర్మన్ రాఘవేంద్ర సందర్శించి అభివృద్ధి పనులను పరిశీలించారు. ఇటీవల ఈదురు గాలులు, వర్షాలతో జరిగిన నష్టాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే, పూర్తి అంచనా నివేదికను కలెక్టర్‌కు పంపాలని ఎంఆర్ఓను ఆదేశించారు. ప్రభుత్వ సహాయం అందేలా చర్యలు తీసుకుంటానని కళాశాల యాజమాన్యానికి హామీ ఇచ్చారు.
KDP: నీళ్లు వాసన వస్తున్నాయని పులివెందుల పట్టణంలోని లక్ష్మీ హాల్ ఏరియా సరస్వతీ వీధికి చెందిన ప్రజలు ఆదివారం మున్సిపల్ కమిషనర్ ముని కుమార్ దృష్టికి తీసుకువెళ్లారు. నీళ్లు కూడా 3 రోజులకు ఒకసారి వస్తున్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని కమిషనర్ తెలియజేశారు.మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
అల్లూరి: ఏజెన్సీ అడవుల్లో లభించే స్వచ్ఛమైన తేనెకు ప్రత్యేక గుర్తింపు ఉంది. కొండలు, లోయలు, అటవీ ప్రాంతాల్లో గిరిజనులు సంప్రదాయ పద్ధతుల్లో తేనెను సేకరిస్తున్నారు. ఔషధ గుణాలు, సహజ రుచితో ఈ తేనె వినియోగదారులను ఆకట్టుకుంటోంది. విక్రయ వేదికలు కల్పిస్తే గిరిజనులకు మరింత ఆదాయం లభిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
నెల్లూరు రూరల్ లోని 18వ డివిజన్, హరినాధపురంలో ప్రజా బాట కార్యక్రమాన్ని ఆదివారం TDP పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నిర్వహించారు. స్థానిక సమస్యలను ప్రజల నుంచి అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 18వ డివిజన్ అభివృద్ధికి 7.50 కోట్ల రూపాయల నిధులు కేటాయించామన్నారు. ఏ సమస్య ఉన్నా పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
NTR: రూరల్ మండలం గొల్లపూడిలోని వాటర్ ఫిల్టర్ బెడ్‌ను మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు ఆదివారం పరిశీలించారు. గొల్లపూడి నుంచి జక్కంపూడి వద్ద నిర్మించిన టిడ్కో గృహాలకు సురక్షిత కృష్ణా జలాలను సరఫరవేసవిలో నీటి ఎద్దడి లేకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామన్నారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఫిల్టర్ బెడ్‌ను పకడ్బందీగా నిర్వహించాలన్నారు.
NTR: పౌర్ణమి సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ భారీగా పెరిగింది. తెల్లవారుజాము నుంచే శ్రీ కనకదుర్గమ్మ దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రద్దీ దృష్ట్యా రూ. 500 దర్శన టికెట్ల విక్రయాలను తాత్కాలికంగా నిలిపివేసి, బంగారు వాకిలి ద్వారా దర్శనం కల్పిస్తున్నారు. ఘాట్ రోడ్, కనకదుర్గానగర్ వైపు వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు.
ELR: పొగాకు వ్యతిరేక దినోత్సవం అవగాహన ర్యాలీ గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఆదివారం నిర్వహించారు. దూమపానం వద్దు, ఆరోగ్యమే ముద్దు అంటూ నినాదాలు చేశారు. గ్రామాలలోని ప్రజలు పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలని వైద్యాధికారి డా. ఓంకార్ నాథ్ అన్నారు. తద్వారా ఆరోగ్యవంతమైన జీవనం సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో విల్సన్ బాబు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
కడప జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం గండి వీరాంజనేయ స్వామి దేవాలయం ఈవోగా విశ్వనాథ్ నియమితులయ్యారు. అన్నమయ్య జిల్లా ఎండోమెంట్ శాఖ అసిస్టెంట్ కమిషనర్‌గా ఉన్న విశ్వనాథ్కు గండి ఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం గండి ఈవోగా బాధ్యతలు చూస్తున్న కర్నూల్ ఎండోమెంట్ డిప్యూటీ కమిషనర్ గురు ప్రసాద్ నేడు రిటైడ్ అవుతున్నారు.
SKLM: ఆమదాలవలస MLA రవికుమార్ సోమవారం ఉ.7 గంటలకు ఆమదాలవలస మండలం 12వ వార్డులో లబ్దిదారులు ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఉ 8 గంటలకు సరుబుజ్జిలి మండలం గోనెపాడులో NTR భరోసా పెన్షన్ల పంపిణీలో పాల్గొంటారు. మ.3 గంటలకు MLA క్రికెట్ కప్ ఫైనల్స్ విజేతలకు బహుమతులు అందజేస్తారు అని MLA కార్యాలయం ఆదివారం ప్రకటనలో తెలిపారు.
మన్యం: గుమ్మలక్ష్మీపురం మండలం స్తంభంగూడ గ్రామంలో తాగునీటి కొరతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామానికి నీరు అందిస్తున్న సోలార్ వాటర్ ట్యాంక్ సామర్థ్యం తక్కువగా ఉండటంతో సరిపడా నీటి సరఫరా జరగడం లేదని స్థానికులు వాపోతున్నారు. పరిసర గ్రామాల ప్రజలు కూడా ఇదే ట్యాంక్‌పై ఆధారపడటంతో సమస్య మరింత తీవ్రమైందని, దీంతో బోర్లు, బావులపై ఆధారపడుతున్నాం అని వాపోతున్నారు.
TPT: పెళ్లకూరు మండలం చెంబడపాలెం వద్ద ఆదివారం ఉదయం 7.20 గంటలకు శ్రీ కాళహస్తి నుంచి నాయుడుపేట వైపు వెళ్లే బైక్‌ను వెనుక నుంచి కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా.. వారిని హైవే అంబులెన్స్ సిబ్బంది కాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
విశాఖలోని ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెల్లవారుజామున సుమారు 3:30 గంటల సమయంలో జూ వైపు వస్తున్న ఓ ఆటో ఎండాడ జంక్షన్ వద్ద కుడివైపు మలుపు తిరుగుతున్న సమయంలో లారీ ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది.
WG: ఇటీవల జరిగిన తెలుగుదేశం మహానాడు తీర్మానాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడం పట్ల చేనేత కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ వావిలాల సరళాదేవి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మహిళలను ఎప్పుడూ గౌరవించే ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణకు రాష్ట్రంలోని ఉన్న మహిళలు అందరి తరపున కృతజ్ఞతలు తెలిపారు.
అన్నమయ్య: మాదకద్రవ్యాల నిర్మూలనకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు పీలేరు, పుంగనూరు ప్రాంతాల్లో శనివారం ‘డ్రగ్ డిటెక్షన్’ కిట్లతో అనుమానితులపై తనిఖీలు నిర్వహించగా.. పరీక్షల్లో అందరికీ నెగిటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. గంజాయి అక్రమ రవాణాపై సమాచారం ఉంటే 112 లేదా ఈగల్ సెల్ 1972కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.