E.G: రాజమండ్రిలోని హోటల్ జగదీశ్వరిలో ఆదివారం ‘అనగనగా తూర్పులంకలో’ చిత్ర ఆడిషన్స్ నిర్వహించారు. లహరి మూవీ మేకర్స్ బ్యానర్‌పై దర్శకుడు పవర్ వినయ్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఉమ్మడి గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి కళాకారులు పెద్ద సంఖ్యలో హాజరై తమ ప్రతిభను ప్రదర్శించారు.
NLR: సంగం-బుచ్చి మండలాల పరిధిలోని KD రిజర్వాయర్‌లో చేపల వేట హక్కుల కోసం ఏప్రిల్ 29న ఉదయం 10 గంటలకు వేలం జరగనుంది. బుచ్చి ఎంపీడీవో కార్యాలయంలో జరిగే బహిరంగ వేలానికి ఆసక్తి ఉన్నవారు హాజరు కావాలని మత్స్యశాఖ అధికారులు ఆదివారం కోరారు. రూ.10,000 ఈఎండీ చెల్లించాల్సి ఉంటుందన్నారు. దీనికి 1/3 లీజు ఆర్డర్‌కు ముందు చెల్లించాలని సూచించారు.
సత్యసాయి: మంత్రి సత్యకుమార్ యాదవ్ చొరవతో ధర్మవరంలో వికలాంగులకు ఉచిత కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. సంస్కృతి సేవా సమితి, భగవాన్ మహావీర్ వికలాంగ సహాయత సమితి ఆధ్వర్యంలో ఏప్రిల్ 27, 28 తేదీల్లో ఈ శిబిరం జరుగుతుంది. పోతుకుంట రోడ్డులోని కొత్త ఆసుపత్రిలో కాళ్లు, చేతులు లేని వారికి ఉచితంగా కృత్రిమ అవయవాలు అమర్చనున్నారు.
SKLM: కొత్తూరు మండలం కౌసల్యపురం గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామి వారి 14వ వార్షికోత్సవం ఘనంగా ఆదివారం నిర్వహించబడింది. ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాల్గొని, స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమానికి రూ.10,000 విరాళంగా అందజేశారు. కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
CTR: చిత్తూరులో ప్రతి సోమవారం ఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించే పోలీసు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఈ వారం పలమనేరు డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించనున్నారు. దీనిని ప్రజలు గుర్తించాలని ఎస్పీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. సమస్యలు తెలియజేసే వారు పలమనేరు డీఎస్పీ కార్యాలయానికి రావాలని అందులో సూచించారు.
GNTR: ఒడిశాకు చెందిన మహిళ ఫిరంగిపురం వచ్చి తిరిగి వెళ్తూ తప్పిపోయింది. ఈ నెల 20న తల్లిదండ్రులు గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేయడంతో ఫిరంగిపురం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మహిళ సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆమె మహారాష్ట్రలో ఉన్నట్లు గుర్తించి మహిళను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్‌లో ఆమె తల్లిదండ్రులకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు.
విశాఖ: రాష్ట్ర మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఇవాళ విశాఖ రానున్నారు. రాత్రి 9.40 గంటలకు విశాఖ ఎయిర్ పోర్ట్‌కు చేరుకొని రాత్రికి నగరంలోనే బస చేస్తారు. రేపు విశాఖ వస్తున్న ఉపరాష్ట్రపతి, సీఎంకి స్వాగతం పలికి పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. మంగళవారం గూగుల్ డాటా సెంటర్ శంకుస్థాపనలో సీఎం చంద్రబాబుతో పాల్గొని, ఆరోజు సాయంత్రం విజయవాడకు వెళ్తారు.
మన్యం: సాలూరు నియోజకవర్గ పరిధిలోని వివాదాస్పద కోటియా గిరిజన గ్రామాల్లో ఒడిశా పోలీసుల తీరుపై రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జనగణన లెక్కలకు సహకరించలేదనే నెపంతో ఎగువశింబి గ్రామానికి చెందిన ఇద్దరు గిరిజనులను ఒడిశా పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు.
NDL: డోన్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన సోనో స్కాన్స్ కేంద్రాన్ని ఆదివారం వైసీపీ యువనేత బుగ్గన అర్జున్ అమర్నాథ్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. తక్కువ ఖర్చుతో ప్రజలకు సకాలంలో స్కానింగ్ సేవలు అందించాలని నిర్వాహకులకు బుగ్గన సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
KRNL: సెన్సెస్-2027పై అవగాహన కల్పిస్తూ ఆదివారం కర్నూలులో 5కే రన్ నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కొండారెడ్డి బురుజు నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు రన్ సాగింది. అనంతరం విజేతలకు బహుమతులు అందజేసి, జనగణనకు ప్రజలు సహకరించాలని అధికారులు కోరారు.
E.G: కొవ్వూరు మండలం ఐ.పంగిడి గ్రామానికి చెందిన జనసేన నాయకుడు పీకే రంగారావు మృతి చెందడం స్థానికంగా విషాదాన్ని నింపింది. ఆయన మరణవార్త తెలిసిన వెంటనే గ్రామస్థులు, పార్టీ కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పార్టీ అభివృద్ధికి కృషి చేసిన రంగారావు సేవలను నేతలు స్మరించుకున్నారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు.
NLR: చేజర్ల మండలంలోని చిత్తలూరు, రెడ్డి గుంట వాగు వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. గాలిపాలెం నుంచి చేజర్లకు వెళుతున్న కారు అకస్మాత్తుగా అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ముళ్ళ పొదల్లోకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగినప్పుడు కారులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. కారు ముందు భాగం దెబ్బతినింది.
KRNL: సామూహిక వివాహాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన తెలంగాణ మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు ఇవాళ ఆలూరులో దళిత నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన బళ్లారి జిల్లా సిరుగుప్ప తాలూకా ఈరన్న క్యాంప్‌లో నిర్వహిస్తున్న సామూహిక వివాహాల కార్యక్రమానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
ATP: హనీట్రాప్ కేసులో పోలీసు ఉన్నతాధికారులు విచారణ ముమ్మరం చేశారు. ఇప్పటికే ఇద్దరు సీఐలు, పలువురు సిబ్బందిని వీఆర్‌కు పంపగా, తాజాగా రాప్తాడు సీఐ డ్రైవర్‌పై చర్యలు తీసుకున్నారు. ఎస్పీ జగదీశ్ పర్యవేక్షణలో ఏఎస్పీ, ట్రైనీ ఐపీఎస్ అధికారుల బృందం విచారణ జరుపుతోంది. ప్రధాన నిందితురాలు రంగమ్మను కస్టడీకి తీసుకున్న పోలీసులు రహస్యంగా విచారిస్తున్నారు.
E.G: రాజమండ్రి పాత సోమలమ్మ అమ్మవారి ఆలయం రోడ్డులో నూతనంగా నిర్మించిన రమేష్ కిడ్నీ హాస్పిటల్ ప్రారంభోత్సవం జరిగింది. యాజమాన్యం ఆహ్వానం మేరకు రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.