NDL: గడిగరేవుల గ్రామంలో వెలిసిన శ్రీ దుర్గా బోగేశ్వరస్వామి దేవస్థానంలో సోమవారం కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు శ్యాంసుందర్ శర్మ తెలిపారు. ఆదివారం సాయంత్రం స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులకు వివిధ రకాల ద్రవ్యాలతో దాతల ఆధ్వర్యంలో మంగళ స్నానం, రుద్రాభిషేక పూజలు వైభవంగా జరిపారు. కళ్యాణ మహోత్సవానికి భక్తులు హాజరు కావాలన్నారు.
కోనసీమ: అమలాపురం మండలం వేమవరప్పాడు గ్రామంలో మానుపాటి గోవింద అనే కొబ్బరి కార్మికుడు కొబ్బరికాయలు దింపు పనిలో ఉండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తాకి అక్కడికక్కడే మృతి చెందాడు. చెట్టుపై కొబ్బరికాయలు దింపుతున్న సమయంలో కొబ్బరాకు అడ్డుగా ఉండటంతో దానిని తొలగించే ప్రయత్నంలో గోవింద విద్యుత్ తీగలను తాకాడు. దీంతో అతను తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
NTR: విస్సన్నపేట మండలం పుట్రెల గ్రామంలోని రైస్ మిల్లును ఆర్డీవో ఏ.కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి ధాన్యం దిగుమతుల్లో ఎదురవుతున్న సమస్యలను తెలుసుకున్నారు. మిల్లులో ఏర్పాట్లు, కొనుగోలు విధానంపై వివరాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ కే.లక్ష్మీ కళ్యాణి పాల్గొన్నారు.
KRNL: ఆదోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో సీజ్ చేసిన అవెంజర్ బైక్ కనిపించకుండా పోవడం కలకలం రేపింది. హైదరాబాద్‌కు చెందిన సోమశంకర్ జరిమానా చెల్లించినప్పటికీ బైక్ ఇవ్వలేదని ఇవాళ ఆరోపించాడు. ఏడు నెలల తర్వాత స్టేషన్‌కు వెళ్లగా బైక్ మాయం అయినట్టు తెలిసి షాక్‌కు గురయ్యాడు. విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాధితుడు, ఆయన తల్లి డిమాండ్ చేశారు.
కృష్ణా: యనమలకుదురులో పి4 పథకం కింద చేపల మార్కెట్‌ను టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు Y. V. B. రాజేంద్రప్రసాద్, ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఇవాళ ప్రారంభించారు. పేద వర్గాలకు ఉపాధి అవకాశాలు కల్పించి ఆర్థిక భరోసా అందించడమే లక్ష్యమని వారు తెలిపారు. పి4 పథకం సామాజిక ఆర్థిక అసమానతలు తగ్గించడంలో దోహదపడుతుందన్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ASR: డుంబ్రిగూడ మండలం జోగిపుట్టు గ్రామానికి చెందిన కోర్రా బ్రుందకు ఆదివారం ప్రసవ వేదనలు ప్రారంభమయ్యాయి. కుటుంబ సభ్యులు సమాచారం ఇవ్వడంతో 108అంబులెన్స్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు.ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే అంబులెన్స్‌లో ప్రసవం జరిగి ఆడ శిశువు జన్మించింది. తల్లి, శిశువు ఇద్దరూ సురక్షితంగా ఉన్నారని EMT ఏ. అప్పలనాయుడు తెలిపారు.
TPT: నాగలాపురంలోని వేద నారాయణ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల వేళ సన్నిధి వీధిలో రాజకీయ ఫ్లెక్సీలు విస్తరించడం వివాదాస్పదమైంది. దర్శన మార్గంగా ఉండాల్సిన వీధి పార్టీ బ్యానర్లు, బోర్డులతో నిండిపోవడంతో భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బ్రహ్మోత్సవాలకు వేలాదిగా భక్తులు తరలివచ్చే నేపథ్యంలో ఆధ్యాత్మిక వాతావరణం దెబ్బతింటోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
KRNL: ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే డా. బీవీ జయనాగేశ్వర్ రెడ్డి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. వాసవి మాత శాంతి, సేవా భావానికి ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘ సభ్యులు, నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ATP: గుత్తిలోని ఓల్డ్ సీపీఐ కాలనీలో నివాసముండే షాహినా అనే మహిళ ఇంట్లో శనివారం రాత్రి 4 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో ఆదివారం జిల్లా క్లూస్ టీం సభ్యులు చోరీ జరిగిన ఇంటిని పరిశీలించారు. కిటికీలు, డోర్లపై ఉన్న వేలిముద్రలు సేకరించారు. పరిసరాలలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు.
KRNL: వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును తక్షణమే బర్తరాఫ్ చేయాలని ఆదివారం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ధరూర్ జేమ్స్ ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. దళిత యువకుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించి, ప్రలోభాలకు గురిచేసి కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని ఆరోపించారు. న్యాయ ప్రక్రియను ప్రభావితం చేసే ప్రయత్నాలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు.
GNTR: నగరంపాలెం పీఎస్ పరిధిలోని సత్తెనపల్లి రోడ్డులో విజయలక్ష్మి బార్‌లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్న సమాచారంతో టాస్క్ ఫోర్స్ దాడి చేసింది. ఆన్‌లైన్ యాప్‌ల ద్వారా బెట్టింగ్ ఆడుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని, ఖాతాల్లో రూ.3,748 ఉన్నట్లు గుర్తించారు. తదుపరి విచారణకు కేసును నగరంపాలెం పోలీసులకు అప్పగించామన్నారు.
VZM: జిల్లాలో దొంగతనాలను అరికట్టేందుకు రాత్రి గస్తీ, పెట్రోలింగ్‌ను మరింత కట్టుదిట్టం చేస్తున్నట్లు SP దామోదర్ ఆదివారం తెలిపారు. ముందస్తు భద్రత చర్యల్లో భాగంగా పోలీసు సిబ్బందికి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. తాళాలు వేసిన ఇళ్ల వద్ద ప్రత్యేక నిఘా పెట్టాలని, అనుమానాస్పద వ్యక్తులపై పర్యవేక్షణ పెంచాలని సూచించారు.
AKP: మునగపాక మండలం తోటాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థులు ఆదివారం అదే పాఠశాలలో కలుసుకున్నారు. 2010-11 బ్యాచ్‌కి చెందిన పదవ తరగతి విద్యార్థులు ఆత్మీయ సమావేశం నిర్వహించి చిన్నప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పూర్వ విద్యార్థులు అందరూ కలిసి భోజనాలు చేసి ఆటపాటలతో ఆనందంగా గడిపారు.
కోనసీమ: జిల్లా వైసీపీ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులుగా అల్లవరం మండలానికి చెందిన సాధనాల శ్రీను నియమితులయ్యారు. ఆయనకు అమలాపురం మాజీ ఎంపీ చింతా అనురాధ అభినందనలు తెలిపారు. వైసీపీ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో కొనుకు గౌతమి, రాపాకు విజయలక్ష్మి, బర్రె సీతారత్నం తదితరులు పాల్గొన్నారు.
పల్నాడు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ఐపీఎస్ జిల్లా నేర సమీక్షలో కీలక ఆదేశాలు జారీ చేశారు. పెండింగ్ కేసుల పరిష్కారంపై దృష్టి సారించాలని, సీసీటీఎన్ఎస్ డేటా అప్‌డేట్ చేయాలని సూచించారు. రౌడీషీటర్లకు వారానికి కౌన్సెలింగ్, గంజాయి కేసుల్లో సస్పెక్ట్ షీట్లు తప్పనిసరి అన్నారు. మహిళా భద్రత, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలపై కట్టుదిట్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు.