CTR: గ్రామాల్లో తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో అప్పాజీ తెలిపారు. మంగళవారం స్థానికులు ఆయనను కలిసి సమస్యలను వివరించారు. మొరంపల్లి, సుగాలిమిట్ట, ఏడూరు, రంగోలిమిట్ట, మీర్జేపల్లిలో కొత్త బోర్లు వేయాలని, లక్ష్మీనాయక్ తాండ, చదల్లలో బోరు డీప్నింగ్ చేయాలని కోరారు. స్పందించిన ఎంపీడీవో, నీటి సమస్య పరిష్కారానికి తక్షణమే కృషి చేస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు.
KDP: మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ చాపాడులో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. వేసవి దృష్ట్యా మజ్జిగ, శుద్ధ నీరు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. KC కాలువ కింద రైతులు మంచి దిగుబడులు సాధించడంపై ఆనందం వ్యక్తం చేశారు. అలగనూరు బాలెన్సింగ్ రిజర్వాయర్ మరమ్మతులకు నిధులు సమీకరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
W.G: నరసాపురం ప్రథమ శ్రేణి శాఖా గ్రంథాలయంలో మంగళవారం వేసవి శిక్షణ తరగతుల ప్రారంభమయ్యాయి. గ్రంథాలయ అభివృద్ధి కమిటీ ఉపాధ్యక్షులు, శాస్త్రవేత్త సుబ్బారావు స్వాగతం పలికారు. ముఖ్య అతిథిగా ఎంఈవో పుష్పరాజ్యం పాల్గొని రిబ్బన్ కట్ చేసి తరగతులను ప్రారంభించారు. అనంతరం గ్రంథాలయ పితామహుడు అయ్యంకి వెంకటరమణయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
NLR: కళ్లున్నా చూడలేని కబోధులు, చెవులున్న వినపడని వారికి ఏం చెప్పినా ఫలితం ఉండదని పరోక్షంగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డిని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన మనుబోలులోని జగనన్న కాలనీలో పర్యటించారు. పేదలకు ఇల్లులు నిర్మించిన ఘనత తమ ప్రభుత్వం అని అన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం కనీసం నిధులు మంజూరు కూడా చేయడం లేదన్నారు.
NDL: ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడ గ్రామంలో ఈ నెల 23న వడ్డే మనోజ్ హత్యకు గురైన ఘటన నేపథ్యంలో ఇవాళ పాణ్యం ఎమ్మెల్యే, టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు గౌరు చరిత రెడ్డి గ్రామానికి వెళ్లి మనోజ్ కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబీకులకు ధైర్యం చెప్పారు. ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీస్ అధికారులను MLA ఆదేశించారు.
KRNL: పత్తికొండ మండల అంగన్వాడీ కేంద్రాల్లో అవకతవకలు జరుగుతున్నాయని బీజేపీ నాయకులు ఎమ్మార్వోకు వినతిపత్రం ఇచ్చారు. కేంద్రాలు సమయానికి తెరుచుకోవడం లేదని, టీచర్లు హాజరు కాక ఆయాలే నిర్వహిస్తున్నారని ఆరోపించారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం సక్రమంగా అందడం లేదన్నారు. విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
E.G: రాజానగరం నియోజకవర్గ పరిధిలోని ఏటిగట్టు ప్రాంత గ్రామాల్లో దశాబ్దాల కాలంగా పెండింగ్‌లో ఉన్న రహదారి సమస్యను పరిష్కరించినందుకు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణను ప్రముఖ సినీ దర్శకులు కాశీ విశ్వనాథ్ మంగళవారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కాశీ విశ్వనాథ్ ఎమ్మెల్యే దంపతులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
PLD: వెల్దుర్తి క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ అభివృద్ధి, రానున్న ప్రాజెక్టులు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై వివరాలు వెల్లడిస్తూ.. అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై స్పష్టత ఇచ్చారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యమని తెలిపారు.
ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరతపై వస్తున్న పుకార్లను నివారించేందుకు జిల్లా ఎస్పీ వీ. హర్షవర్ధన్ రాజు అద్దంకిలోని పెట్రోల్ బంకులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇంధన నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, ఎలాంటి కొరత లేదని స్పష్టం చేశారు. బంక్ నిర్వాహకులు కేవలం వాహనాలకు మాత్రమే ఇంధనం నింపాలని, క్యాన్‌లలో నింపరాదని ఆదేశించారు.
ATP: రాయదుర్గంలోని డ్వామా కార్యాలయంలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు మంగళవారం వెలుగు గ్రామ సంఘాల వీవోఏలకు సెల్ ఫోన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న సభ్యులకు సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం పీఎం-అజయ్ పథకం కింద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.33.50 లక్షల రుణాల మంజూరు పత్రాలను మహిళలకు హ్యాండోవర్ చేశారు.
తిరుపతిలో ఇంధన కొరత, పెరిగిన ధరలకు వ్యతిరేకంగా ఆటో డ్రైవర్లు వినూత్న నిరసన చేపట్టారు. CITU ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డ్రైవర్లు ఆర్టీసీ బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం సర్కిల్ వరకు డీజిల్ లేక ఆగిపోయిన ఆటోలను తాడుతో లాగుతూ నిరసన తెలిపారు. మెడకు ఉరితాడు బిగించుకుని తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ, ఇంధనం బ్లాక్ మార్కెట్‌ను అరికట్టి ఆటో కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
సత్యసాయి: చిత్తూరు జిల్లాలో ఏబీఎన్ రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డి హత్యపై మంత్రి సవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ.. జర్నలిస్టులను హత్య చేయడం క్షమించరాని నేరమని, నిందితులు ఎంతటి వారైనా వదిలేది లేదని స్పష్టం చేశారు. బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ప్రభుత్వపరంగా అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
CTR: నగరి ఎంపీడీవో కార్యాలయంలో DRDA ఆధ్వర్యంలో 5G స్మార్ట్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే భాను ప్రకాష్ ముఖ్యఅతిథిగా పాల్గొని సంఘమిత్రలకు మొబైల్ ఫోన్లు అందజేశారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ సేవలు, విధులను మరింత వేగంగా, సమర్థవంతంగా నిర్వహించాలనే లక్ష్యంతో ఈ పంపిణీ చేపట్టినట్లు ఆయన తెలిపారు. సాంకేతికతను అందిపుచ్చుకుని ప్రజలకు మెరుగైన సేవలందించాలని ఎమ్మెల్యే కోరారు.
E.G: కేవలం ఏపీలోనే పెట్రోల్, డీజీల్ సంక్షోభం, కృతిమ కొరత ఏర్పడిందని మాజీ మంత్రి, రూరల్ వైసీపీ ఇంఛార్జ్ వేణుగోపాలకృష్ణ విమర్శించారు. మంగళవారం రాజమండ్రిలోని పెట్రోల్ బంకు వద్ద వైసీపీ ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం రాష్ట్రంలోనే పెట్రోల్, డీజిల్ సంక్షోభం ఏర్పడిందని ఆయన మండిపడ్డారు. దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి చలనం లేదన్నారు.
W.G: రాష్ట్రంలోని అన్ని పెట్రోల్ బంకుల్లో డీజిల్ అందుబాటులో ఉంచాలని YCP నియోజకవర్గ కోఆర్డినేటర్ వడ్డీ రఘురాం నాయుడు డిమాండ్ చేశారు. ఇంధన కొరతపై మంగళవారం తాడేపల్లిగూడెంలో నిర్వహించిన నిరసనలో ఆయన పాల్గొన్నారు. డీజిల్ అందుబాటులో లేకపోతే బంకులను ముట్టడిస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం బంకుల వద్ద టిన్నులు పెట్టే పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు.