• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఘనంగా సత్యనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు

ELR: లింగపాలెం మండలం రంగాపురంలోని చిన్న అన్నవరంగా పేరుగాంచిన శ్రీ భూనీల సహిత సత్యనారాయణ వారి ఆలయంలో 62వ బ్రహ్మోత్సవాలు సోమవారం రెండవ రోజుకు చేరుకున్నాయి. ఆలయ ప్రాంగణంలో విశ్వక్ సేన పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, అంకురార్పణ వంటి కార్యక్రమాలను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అలాగే భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.

April 28, 2026 / 07:56 AM IST

నేడు డోన్‌లో మాజీ మంత్రి ప్రెస్ మీట్

NDL: కృత్రిమ ఇంధన కొరత అంశంపై ఇవాళ ఉ. 10 గంటలకు డోన్ వైసీపీ కార్యాలయంలో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు పార్టీ నాయకులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో ప్రస్తుత పరిస్థితులపై బుగ్గన మాట్లాడతారన్నారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు, తప్పనిసరిగా హాజరుకావాలని పిలుపునిచ్చారు.

April 28, 2026 / 07:54 AM IST

డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో భారీ జరిమానా

తిరుపతి పట్టణంలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడుపుతూ 20 మంది పట్టుబడ్డారు. వీరికి కోర్టు ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున మొత్తం రూ. 2 లక్షల జరిమానా విధించిందని ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తప్పవని, మద్యం తాగి వాహనాలు నడపడం నేరమని పోలీసులు హెచ్చరించారు.

April 28, 2026 / 07:40 AM IST

‘ప్రజా సంక్షేమమే ప్రభుత్వం ధ్యేయం’

SKLM: ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వం ధ్యేయం అని ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు అన్నారు. సోమవారం రాత్రి జి సిగడం M సంత వూరిటీ లో MLA పర్యటించారు. ఈ మేరకు నమస్తే ఎచ్చెర్ల కార్యక్రమంలో పాల్గొని , రూ.1.55 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానిక ప్రజలతో మాట్లాడి, ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అధికారులు నాయకులు ఉన్నారు.

April 28, 2026 / 07:38 AM IST

పేకాట శిభిరంపై దాడి.. ఏడుగురు అరెస్ట్

KRNL: ఆదోని మండలం కుప్పగల్ దర్గా సమీపంలో పేకాట ఆడుతున్న ఏడుగురిని పెద్ద తుంబలం ఎస్సై విద్యా శ్రీ అరెస్ట్ చేశారు. సోమవారం సాయంత్రం జరిపిన దాడిలో నిందితుల వద్ద రూ.11,500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఆమె తెలిపారు. జూదగాళ్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.

April 28, 2026 / 07:27 AM IST

అక్రమంగా మద్యం అమ్ముతున్న వ్యక్తికి జైలు శిక్ష

ప్రకాశం: సింగరాయకొండలో అక్రమంగా మద్యం బెల్టు షాపు నిర్వహిస్తున్న వ్యక్తికి కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. 2024లో సోమరాజు పల్లి చెందిన కొండయ్య సింగరాయకొండలో మద్యం బెల్ట్ షాపు నిర్వహిస్తూ ఎక్సైజ్ అధికారులకు పట్టు పడ్డాడు. అప్పటి నుంచి విచారణ చేపట్టిన కోర్టు జైలు శిక్ష, రూ.3వేలు జరిమానా విధించింది.

April 28, 2026 / 07:21 AM IST

విజయ్ ఆయిల్ ఫిల్లింగ్ స్టేషన్‌పై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

PLD: నరసరావుపేటలోని విజయ్ ఆయిల్ ఫిల్లింగ్ స్టేషన్‌ను జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా రాత్రి 10 గంటలకు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇంధన నాణ్యత, కొలతల సక్రమతపై పరిశీలించారు. నిబంధనలు కచ్చితంగా పాటించాలని సిబ్బందికి ఆదేశిస్తూ, వినియోగదారులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

April 28, 2026 / 07:17 AM IST

‘ఇంధన కొరతతో రైతులకు ఇబ్బంది పడుతున్నారు’

BPT: ఆంధ్రప్రదేశ్‌లో గత మూడు రోజులుగా తీవ్రమైన డీజిల్ కొరత నెలకొందని, దీనివల్ల అంబులెన్స్‌లు, రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని అద్దంకి వైసీపీ ఇన్‌ఛార్జ్ డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి డీజిల్ కొరతను తీర్చాలని డిమాండ్ చేశారు లేదంటే వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారన్నారు.

April 28, 2026 / 07:14 AM IST

పీజీఆర్‌ఎస్ కార్యక్రమానికి 98 ఫిర్యాదులు: కలెక్టర్

CTR: నగరి నియోజకవర్గం నిండ్రలో జరిగిన జిల్లాస్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమానికి 98 ఫిర్యాదులు అందినట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. వీటిలో రెవెన్యూకు 16, భూములకు 36, పోలీసు 11, పంచాయతీ రాజ్ 7, ఇంజినీరింగ్ 6, నగరి అడ్మినిస్ట్రేషన్‌పై 5 ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

April 28, 2026 / 07:14 AM IST

కానిస్టేబుల్ కుటుంబానికి పోలీసు శాఖ ఆర్థిక సాయం

తూ.గో: మరణించిన కానిస్టేబుల్ వెల్లా ప్రసాద్ కుటుంబానికి జిల్లా పోలీసులు అండగా నిలిచారు. ఎస్పీ డి. నరసింహ కిషోర్ రూ. లక్ష అంత్యక్రియల కోసం, వెల్ఫేర్ ఫండ్ నుండి రూ. 25 వేలు అందజేశారు. 2012 బ్యాచ్ కానిస్టేబుళ్లు రూ. 4.04 లక్షలు సేకరించి కుటుంబానికి అందించారు. క్లిష్ట సమయంలో సహచర సిబ్బంది చూపిన ఈ మానవత్వం ఆ కుటుంబానికి కొండంత భరోసాను ఇచ్చింది.

April 28, 2026 / 07:14 AM IST

షటిల్ బ్యాట్మెంటన్‌లో శిక్షణ తరగతులు

SKLM: పాతపట్నంలో షటిల్ బ్యాడ్మింటన్‌లో బుధవారం నుండి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. స్థానిక ఇండోర్ స్టేడియంలో శిక్షణ ఇస్తామని ఆసక్తి ఉన్న వారు హాజరు కావాలని నిర్వాహకుడు మడ్డు ప్రకాశ్ తెలిపారు. వివరాలకు 9603306440, 95154 51440 నంబర్లను సంప్రదించాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

April 28, 2026 / 07:12 AM IST

రైతులకు ఊరట.. రైతుకి 70 లీటర్లు డీజిల్ పంపిణీ

కాకినాడ: సామర్లకోట రైల్వే స్టేషన్ సెంటర్ వద్ద గల భారత్ పెట్రోలియం బంకులో సోమవారం సాయంత్రం రైతులకు ప్రత్యేకంగా డీజిల్ పంపిణీ చేశారు. ఆటోలకు, రైతులకు టోకెన్లు ఇచ్చి క్యూ పద్ధతిలో ఇంధనం అందజేశారు. ప్రతి రైతుకు 70 లీటర్ల డీజిల్ పరిమితి విధించారు. పెట్రోల్ స్టాక్ రావాల్సి ఉందని నిర్వాహకులు తెలిపారు. పంపిణీ సజావుగా సాగేందుకు అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

April 28, 2026 / 07:10 AM IST

డీజిల్, పెట్రోల్ పై వదంతులు నమ్మవద్దు: కలెక్టర్

VZM: జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత ఉన్నట్లుగా వస్తున్న వదంతులను ప్రజలు నమ్మవద్దని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి సోమవారం తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరం పీజీఆర్ఎస్ సమీక్షా సమావేశంలో భాగంగా జిల్లాలో ఇంధన సరఫరా పరిస్థితిపై ఆయన సమీక్షించారు. జిల్లాలో మొత్తం 134 పెట్రోల్ బంకులు ఉండగా, అందులో నాలుగు బంకులు తాత్కాలికంగా మూసివేసినట్లు చెప్పారు.

April 28, 2026 / 07:09 AM IST

సింధు విజయ్‌ను పరిశీలించిన నాగాలాండ్‌ సీఎం

VSP: నాగాలాండ్ ముఖ్యమంత్రి నేయిఫియు రియూ తన విశాఖపట్నం పర్యటనలో భాగంగా నావల్ డాక్ యార్డ్‌ను సందర్శించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన భారత నౌకాదళానికి చెందిన ప్రతిష్టాత్మక జలాంతర్గామి ఐఎన్‌ఎస్ సింధు విజయ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా జలాంతర్గామి కమాండింగ్ ఆఫీసర్ నిశాంత్ చతుర్వేది ముఖ్యమంత్రికి సాదర స్వాగతం పలికారు.

April 28, 2026 / 07:08 AM IST

టీడీపీతోనే బీసీలకు రాజకీయ గుర్తింపు: ఎంపీ అంబికా

ATP: టీడీపీ పార్టీ ఆవిర్భావంతోనే బీసీలకు రాజకీయంగా నిజమైన న్యాయం జరిగిందని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్ హయాం నుంచి నేటి చంద్రబాబు ప్రభుత్వం వరకు బీసీలకు చట్టసభల్లో, పదవుల్లో పెద్దపీట వేస్తున్నట్లు పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం బీసీ నాయకులను అక్రమ కేసులతో వేధించిందని విమర్శించారు.

April 28, 2026 / 07:08 AM IST