• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఆదోనిలో బీజేపీలోకి చేరికలు

KRNL: ఆదోనిలో ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారధి సమక్షంలో ఇవాళ వైసీపీ నుంచి 30 కుటుంబాలు బిజెపిలో చేరాయి. హనవాలు గ్రామానికి చెందిన నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరికయ్యారు. బీజేపీ మండల నాయకుల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. పార్టీ బలోపేతానికి కలిసి పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

April 26, 2026 / 06:27 PM IST

జిల్లాలో టమోటా మార్కెట్లలో అక్రమాలకు చెక్

అన్నమయ్య: జిల్లా టమోటా మార్కెట్ యార్డుల్లో అక్రమాలకు తావులేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నిశాంత్ ఆదేశించారు. మార్కెట్లలో 15 కిలోల క్రేట్లను తప్పనిసరిగా అమలు చేయడంతో పాటు, హమాలీలు, లారీ సంఘాలు రైతుల నుంచి ఎలాంటి వసూళ్లు చేయరాదని హెచ్చరించారు. సీసీ కెమెరాలు, డిజిటల్ బోర్డులు, తాగునీరు వంటి సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

April 26, 2026 / 06:24 PM IST

రేపు నూజివీడులో మీకోసం

KDP: నూజివీడు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో రేపు ఉదయం 10 గంటలకు మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించడం జరుగుతుందని సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న తెలిపారు. సబ్ కలెక్టర్ వినూత్న ఆదివారం సాయంత్రం మాట్లాడుతూ.. రెవిన్యూ డివిజన్ పరిధిలోని ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అందించాలన్నారు. ప్రతి సమస్య పరిష్కరిస్తామన్నారు.

April 26, 2026 / 06:16 PM IST

‘ఐటీడీఏ అస్తవ్యస్తంగా తయారైంది’

PPM: గత వైసిపి,ప్రస్తుత కూటమి పాలనలో పార్వతీపురం ITDA అస్తవ్యస్తంగా తయారైందని కాంగ్రెస్ పార్టీ DCC జిల్లా అధ్యక్షులు వంగల దాలినాయుడు ఆరోపించారు. గత ఆరు ఏళ్లుగా ITDA పాలకవర్గ సమావేశం సైతం నిర్వహించకుండా పాలకులు గిరిజనులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. గిరిజన సంక్షేమం, సమస్యలు పట్టించుకోకుండా గాలికి వదిలేశారన్నారు.

April 26, 2026 / 06:15 PM IST

జిల్లాలో డీజిల్ కొరత లేదు

VZM: జిల్లాలో డీజిల్ సరఫరాకు సంబంధించి వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా పౌర సరఫరా అధికారి జి. మురళీనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రాష్ట్ర వ్యాప్తంగా డీజిల్ సరఫరాపై వీసీలో సమీక్షించారు. రాష్ట్రంలో ఎక్కడా డీజిల్ కొరత లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు.

April 26, 2026 / 06:14 PM IST

మెగా ఉచిత వైద్య శిబిరం విజయవంతం

NDL: సంజామల మండలం మంగపల్లెలో నిర్వహించిన 67వ మెగా ఉచిత వైద్య శిబిరం విజయవంతమైందని నిర్వాహకుడు పి.మౌలాలి రెడ్డి ఆదివారం తెలిపారు. పేదల ఆరోగ్య రక్షణ కోసం ప్రతి నెల శిబిరాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. నిపుణ వైద్యులు వివిధ వ్యాధులకు పరీక్షలు చేసి సుమారు 1,000 మందికి ఉచిత మందులు అందించారు. భోజన వసతి కూడా కల్పించారు.

April 26, 2026 / 06:10 PM IST

‘ పరిశ్రమల ప్రక్రియను సులభతరం చేయడమే లక్ష్యం’

W.G: జిల్లాలో పరిశ్రమల స్థాపన ప్రక్రియను సులభతరం చేయడమే లక్ష్యంగా “ఇండస్ట్రియల్ గైడెన్స్ సెంటర్ ఏర్పాటు చేయబడిందని కలెక్టర్ నాగరాణి పేర్కొన్నారు. ఇవాళ ఆమె మాట్లాడుతూ.. పారిశ్రామికవేత్తలకు అవసరమైన అన్ని సేవలను ఒకే చోట అందించాలనే ఉద్దేశంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మధ్యవర్తుల వద్దకు వెళ్లి అనవసరమైన కాలయాపన, ఖర్చులు చేయవద్దని సూచించారు.

April 26, 2026 / 06:10 PM IST

కపటి అభివృద్ధికి నిధులు కోరుతూ వినతి

KRNL: ఆదోని మండలం కపటి గ్రామ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని ఇవాళ ఎమ్మెల్యే డా. పార్థసారధికి బీజేపీ ఆదోని మండల నాయకులు వినతి పత్రం అందించారు. బ్రిడ్జి నిర్మాణం, సీసీ రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సదుపాయాల కోసం డిమాండ్ చేశారు. స్మశానవాటికల అభివృద్ధి కూడా చేపట్టాలని కోరారు. గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

April 26, 2026 / 06:08 PM IST

డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి: జెసి

ఏలూరు జిల్లాలో పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని జేసి అభిషేక్ గౌడ అన్నారు. ఆదివారం ఆయన వివరాలు తెలిపారు. జిల్లాలో 232 పెట్రోల్ బంకులలో పెట్రోలు, డిజిల్స్‌కు సంబందించి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ధాన్యం లారీలకు డీజిల్ సమస్య ఉంటే స్థానిక తహసీల్దార్ ఆధ్వర్యంలో టోకెన్ ద్వారా అందిస్తున్నామన్నారు.

April 26, 2026 / 06:06 PM IST

APL వేలంలో జాక్‌పాట్.. జిల్లా జట్టుకు స్టార్ ప్లేయర్

NTR: ఏపీఎల్ సీజన్-5 వేలంలో ఉత్కంఠభరిత వాతావరణం మధ్య ఫలితాలు వెలువడ్డాయి. విజయవాడ సన్‌రైజర్స్ జట్టులోకి పండురంగ రాజు పెన్మత్స అధికారికంగా ఎంపికయ్యాడు. రూ.9.50 లక్షలకు ఆయనను జట్టు దక్కించుకోవడం విశేషం. ప్రతిభావంతుడైన ఆటగాడిని జట్టులోకి ఆహ్వానించడం పట్ల ఫ్రాంచైజీ యాజమాన్యం ఆనందం వ్యక్తం చేసింది.

April 26, 2026 / 06:02 PM IST

రోడ్డు ప్రమాదం..హెడ్ కానిస్టేబుల్ మృతి

NTR: ఇబ్రహింపట్నంలో ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రభు కుమార్ అనే హెడ్ కానిస్టేబుల్ మృతి చెందారు. వీరులపాడు నుంచి బైక్ పై ఇంటికి వస్తుండగా వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టిండంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనను 108లో విజయవాడ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు పోలీసులు ధ్రువీకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

April 26, 2026 / 05:49 PM IST

‘క్రమశిక్షణతో పనిచేసి పార్టీని గెలిపించండి’

SKLM: పలాస టీడీపీ సమన్వయకర్త వెంకన్న చౌదరి మండలంలోని బసవసాయి, భోగాబంద, హంసరాలి గిరిజన గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో సమావేశమై స్థానిక సమస్యలు, గ్రామాల అభివృద్ధిపై చర్చించారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయానికి అందరూ క్రమశిక్షణతో కష్టపడాలని, ప్రజలకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు.

April 26, 2026 / 05:44 PM IST

మహానందిలో భక్తుల సందడి

NDL: మహానంది క్షేత్రంలో సెలవు రోజు కావడంతో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. వేలాది సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఉదయం నుంచి ఆలయ ప్రాంగణంలో భక్తుల రద్దీ కనిపిస్తుంది. భక్తులు స్థానిక కోనేరులలో పుణ్య స్నానాలు ఆచరించి శ్రీ కామేశ్వరి దేవి సహిత శ్రీ మహానందీశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.

April 26, 2026 / 05:43 PM IST

వీరబ్రహ్మేంద్ర స్వామికి వైభవంగా పూజలు

KDP: ఖాజీపేట మండలం పుల్లూరు సమీపంలోని నాగ నాదేశ్వర కోన వద్ద బ్రహ్మంగారి ఆలయంలో ఆదివారం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. బ్రహ్మంగారి ఆరాధన ఉత్సవాల సందర్భంగా ఈ పూజలు చేపట్టారు. స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు.

April 26, 2026 / 05:39 PM IST

వాసవి మాతకు కలశ పూజ

KDP: మైదుకూరు పట్టణంలోని కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో వాసవి మాతా జయంతి సందర్భంగా అమ్మవారిని ఆదివారం ప్రత్యేకంగా అలంకరించి పూజ చేశారు. ఈ ప్రత్యేక పూజలలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి కుంకుమార్చన, కలశ పూజలు చేపట్టారు. ఆర్యవైశ్య ప్రతినిధులు భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.

April 26, 2026 / 05:35 PM IST