PPM: కురుపాం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాల నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. సెప్టెంబర్ 6, 2011 నాటి ప్రభుత్వ ఉత్తర్వులు (జి.ఓ. నం.39) ప్రకారం ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. కురుపాం, జియ్యమ్మవలస మండలాల్లో ఖాళీగా ఉన్న 39 అంగన్వాడీ హెల్పర్ పోస్టులను రోస్టర్ విధానంలో భర్తీ చేయనున్నట్లు ప్రాజెక్టు అధికారి తెలిపారు.
TPT: తడ మండలంలోని పెట్రోల్ బంకులను ఆర్ వనజ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను యాజమాన్యాలకు వివరించారు. ముఖ్యంగా రేషనలైజ్ సిస్టమ్‌ను కచ్చితంగా అమలు చేయాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో వీఆర్వోలు జ్ఞానయ్య, బాబు, హైమావతి, వీఆర్ఏ చెంచు కృష్ణ తదితరులు పాల్గొని బంకుల్లో ఇంధన నిల్వలను పరిశీలించారు.
కృష్ణా: పిల్లలు సెల్ ఫోన్ వీడి పుస్తకాలు చదవాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సూచించారు. మంగళవారం అవనిగడ్డలోని గ్రంధాలయంలో వేసవి సెలవుల సందర్భంగా పిల్లలకు ప్రత్యేక శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే ముఖ్య అతిధిగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సెలవుల్లో పిల్లలు సెల్ ఫోన్లకు అతుక్కుపోకుండా విజ్ఞానం కోసం పుస్తకాలు చదవాలన్నారు.
CTR: సదుం మండలం పెడకంటివారిపల్లెలో వెలసిన కోదండరామ స్వామి ఆలయంలో మే 1న సీతారామ కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. శుక్రవారం గణపతిపూజ, కలశస్థాపన, హోమాలతో వేడుకలు ప్రారంభమవుతాయి. రాత్రి 7 గంటలకు స్వామివారి కళ్యాణం, అనంతరం పుష్పపల్లకి సేవ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తరించాలని వారు కోరారు.
ATP: గుంతకల్లు సీఐటీయూ కార్యాలయంలో మేడే వేడుకలపై మంగళవారం సమీక్ష నిర్వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ చట్టాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పని గంటల పెంపు, ఓవర్ టైం నిబంధనల మార్పులతో కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
GNTR: మంగళగిరి ఇంధిరానగర్ యూపీహెచ్‌సీని మంగళవారం అస్సాం వైద్యాధికారుల బృందం సందర్శించింది. రాష్ట్రంలోని వైద్య సేవలపై అధ్యయనంలో భాగంగా ఏడుగురు సభ్యుల బృందం ఇక్కడకు విచ్చేసింది. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి. అనూష రోగులకు అందిస్తున్న సేవలు, యాప్‌ల వినియోగం తదితర అంశాలను వారికి వివరించారు.
PLD: మాచర్ల పురపాలక సంఘానికి బకాయిల చెల్లింపులు కొనసాగుతున్నాయి. పట్టణానికి చెందిన ఓ యాజమాన్యం రూ.32 లక్షలు, చెల్లించించింది. సకాలంలో పన్నులు చెల్లించి పట్టణాభివృద్ధికి తోడ్పడిన యాజమాన్యాలను కమిషనర్ డీ. వేణుబాబు అభినందించారు. ఆస్తి పన్ను వడ్డీపై 50% రాయితీ, 5% రిబేట్ అందుబాటులో ఉన్నందున ప్రజలు, వ్యాపారులు బకాయిలను వెంటనే చెల్లించాలని సూచించారు.
బాపట్ల: చుండూరు మండలం వలివేరు రైల్వే ట్రాక్ సమీపంలోని పొలాల్లో మంగళవారం గుర్తుతెలియని యువకుడి మృతదేహం లభ్యమైంది. రైతుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతుడు ఐదడుగుల ఎత్తు, చామనఛాయ రంగులో ఉన్నట్లు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు చుండూరు ఎస్సై (9440796179), లేదా సీఐ (9440796255) నంబర్లలో సంప్రదించాలని కోరారు.
సత్యసాయి: పుట్టపర్తి కలెక్టరేట్లో మంగళవారం జిల్లా రహదారి భద్రత కమిటీ సమీక్షా సమావేశం జరిగింది. కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, SP సతీష్ నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో రహదారి ప్రమాదాల తగ్గింపుపై కీలక ఆదేశాలు జారీ చేశారు. కియా ఫ్యాక్టరీ పరిసరాల్లో అనధికారిక పార్కింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, రహదారి ఆక్రమణలు, అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించాలని సూచించారు.
KRNL: ఆదోని పట్టణంలోని హనుమాన్ నగర్ వీరాంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవం మంగళవారం కనులపండుగగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీ స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో హక్కులు అవమాధి కార్యక్రమం చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు.
NDL: సంజామల మండలం నొస్సంలో ఇవాళ సాయంత్రం నుంచి రేపటి వరకు జరుగుతున్న దేవర సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణకు రూట్ మళ్లించినట్లు పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. జమ్మలమడుగు నుంచి వచ్చే వాహనాలను గుండ్లకుంట వద్ద మళ్లించి పెద్దముడియం వైపు దారి మళ్లిస్తామన్నారు. KKL నుంచి జమ్మలమడుగు వెళ్లేవారు ALG మార్గం వినియోగించుకోవాలని సూచించారు. ప్రజలు సహకరించాలని కోరారు.
కోనసీమ: ప్రభుత్వ కళాశాలల అభివృద్ధికి, ఉన్నత విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. మంగళవారం ఆయన కొత్తపేట విశ్వ కవి వేమన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రూ.14.44 లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదులను ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నేటి విద్యార్థులు రేపటి రాష్ట్ర భవిష్యత్తు అని అన్నారు.
W.G: నరసాపురం ప్రథమ శ్రేణి శాఖా గ్రంథాలయంలో మంగళవారం వేసవి శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. గ్రంథాలయ అభివృద్ధి కమిటీ ఉపాధ్యక్షుడు, శాస్త్రవేత్త సుబ్బారావు చిన్నారులకు ఆహ్వానం పలికారు. ముఖ్య అతిథిగా MEO పుష్పరాజ్యం పాల్గొని తరగతులను ప్రారంభించారు. జాతీయ నాయకుల జీవిత చరిత్రలు చదవాలని, సెల్ ఫోన్ వినియోగాన్ని తగ్గించి పుస్తక పఠనానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
ATP: అనంతపురం ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ను జిల్లా నూతన అసిస్టెంట్ కలెక్టర్ సుయశ్ కుమార్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రికి పూలమొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అభివృద్ధి, పాలనాపరమైన అంశాలపై మంత్రితో అసిస్టెంట్ కలెక్టర్ చర్చించారు. యువ అధికారులు అంకితభావంతో పనిచేయాలని సూచించారు.
CTR: కాణిపాకం నుంచి శ్రీ పెనుశిల లక్ష్మీనారాయణ స్వామి వారి దేవస్థానం, పెంచలకోనలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఛైర్మన్ మణి నాయుడు, ఈవో పెంచల కిషోర్ స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పెంచలకోన ఈవో కోవూరు జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు.