GNTR: తెనాలిలో నిమ్మకాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వేసవిలో వినియోగం ఎక్కువగా ఉండటంతో ధరలు అమాంతంగా పెరిగాయి. పంట పండించే రైతులకు మాత్రం నామ మాత్రపు ధరలే లభిస్తుండగా వ్యాపారుల వద్ద మాత్రం భారీ ధరలు పలుకుతున్నాయి. రిటైల్ మార్కెట్లో డజను నిమ్మ రూ.120-150 చొప్పున విక్రయిస్తున్నారు.
CTR: వీ కోటలో విలేకరి జగన్ మోహన్ దారుణ హత్యకు గురయ్యారు. ఇటీవల జరిగిన కొన్ని దొంగతనాలపై ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ హత్య వెనుక అదే కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవల జరిగిన దొంగతనాలపై ఆయన పోలీసులకు వివరాలు అందించగా, ఆ విషయాన్ని గుర్తించిన దొంగల గుంపు కక్షతో ఈ దారుణానికి పాల్పడినట్టు ప్రాథమిక సమాచారం.
KDP: వాహనదారులకు మాత్రమే డీజిల్ పట్టాలని తహసీల్దార్ అనురాధ పెట్రోల్ బంకుల యజమానులకు సూచించారు. సింహాద్రిపురంలోని హెచ్‌పి పెట్రోల్ బంకుతో పాటు పలు పెట్రోల్ బంకులను ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా డీజిల్ పట్టాలన్నారు. ఆమె వెంట ఆర్ఐ గంగాధర రెడ్డి, వీఆర్వో పుష్పరాజ్, తదితరులు ఉన్నారు.
సత్యసాయి: కదిరిలో మే 1న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ తెలిపింది. ఎస్‌టీఎస్‌ఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగే ఈ మేళాలో పలు ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయి. 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన 18-38 ఏళ్ల అభ్యర్థులు హాజరుకావచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.13 వేల నుంచి రూ.25 వేల వరకు జీతం ఉంటుందని అధికారులు తెలిపారు.
PLD: నరసరావుపేటలో మహాత్మా గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఛైర్మన్ డాక్టర్ కారసాని శ్రీనివాస్ రెడ్డి ఇటీవల శస్త్రచికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటుండగా ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత క్రాంతి కుమార్ పాల్గొన్నారు.
NDL: మంత్రి నాదెండ్ల మనోహర్‌ను హైదరాబాద్‌లోని ఆయన స్వగృహంలో ఇవాళ మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, సహచర మంత్రులు అచ్చెన్నాయుడు, అనగాని సత్య ప్రసాద్, సత్యకుమార్ యాదవ్‌తో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం మనోహర్‌కు ధైర్యం చెప్పి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
VSP: విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ శంకుస్థాపన సందర్భంగా మంత్రి లోకేశ్ విపక్షాలపై నిప్పులు చెరిగారు. ప్రజా ప్రభుత్వానిది గూగుల్ అయితే.. ఆ పార్టీది గొడ్డలి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొందరు కేసులు వేసి అభివృద్ధిని అడ్డుకోవాలని చూశారని, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ క్రెడిట్ కొట్టేందుకు సీసీడీ రోగులు యత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు.
CTR: వి.కోటలో ఓ పత్రికా విలేకరి జగన్ మోహన్ రెడ్డి హత్య ఘటనపై చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దారుణాన్ని ఖండిస్తూ, సంఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. పత్రికా విలేకరిపై జరిగిన ఈ దాడి క్షమించరానిదని పేర్కొంటూ, ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు.
కాకినాడ: కోరంగి అభయారణ్యంలో పర్యాటకుల కోసం 2.295 కిలోమీటర్ల పొడవైన చెక్క నడక దారి ఉంది. ఆసియాలోనే రెండో అతిపెద్దదిగా గుర్తింపు పొందిన ఈ వంతెనను ఒక్క చెట్టు కూడా నరకకుండా నిర్మించారు. అభయారణ్యంలో 40 మీటర్ల ఎత్తులో ఉన్న వాచ్ టవర్ ద్వారా మొత్తం అడవిని ‘బర్డ్స్ ఐ వ్యూ’ లో చూసే అవకాశం కల్పిస్తున్నారు. ఇక్కడ RX100లో పిల్లారా వంటి పాటలు కూడా చిత్రీకరించారు.
PPM: సీతంపేట ఐటీడీఏ పరిధిలోని ఏకైక పెట్రోల్ బంకులో గత రెండు రోజులుగా డీజిల్, పెట్రోల్ లభ్యం కావడం లేదు. ఇంధన నిల్వలు లేకపోవడంతో బంకు వద్ద ‘నో స్టాక్’ బోర్డులు ఏర్పాటు చేయగా, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే సరఫరా పునరుద్ధరించాలని అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
కృష్ణా: మచిలీపట్నంలోని కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ బాలాజీ ప్రజల వద్ద నుంచి 104 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్జీల రూపంలో వచ్చిన ఫిర్యాదులను అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
TPT: తిరుమలలో భక్తుల భద్రతకు మరో ముందడుగు పడింది. TTD భద్రతను మరింత పటిష్టం చేస్తూ 187 మంది మాజీ సైనికులను అధికారులు విధుల్లో చేర్చుకున్నారు. మొత్తం 373 మందిని TTDలో నియమించుకోవాలని గతంలో ఆలయ ధర్మకర్తల మండలి తీర్మానం చేసింది. తాజాగా TTD ఫస్ట్ ఫేజ్ నియమాకాలు చేపట్టింది.
ATP: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మంగళవారం తెల్లవారుజామున నగరంలోని 26వ డివిజన్‌లో ఆకస్మికంగా పర్యటించారు. కమిషనర్ జశ్వంత్ రావుతో కలిసి రాజీవ్ చిల్డ్రన్స్ పార్క్ పరిసరాలను పరిశీలించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నగరంలోని 28 పార్కుల్లో స్పెషల్ డ్రైవ్ ద్వారా తాగునీరు, టాయిలెట్స్ వంటి మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
కాకినాడ: యు. కొత్తపల్లి మండలం నాగులపల్లి రక్షిత మంచినీటి చెరువులో ఉన్న చేపలు మృతి చెందాయి. మూడు రోజుల నుండి మృతి చెందిన చేపలు అక్కడే ఉండిపోవడంతో దుర్వాసన వెదజల్లుతుంది. దీంతో 18 గ్రామాల ప్రజలు త్రాగునీరు తాగాలా వద్ద అనే సందేహంలో ఉన్నారు. వేసవకాలంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తం 71 లైబ్రరీలో ఈ రోజు నుంచి 40 రోజుల పాటు సమ్మర్ క్యాంపులు నిర్వహించనున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ గురువారెడ్డి తెలిపారు. పిల్లల కోసం పలు పుస్తకాలు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. పలు అంశాలపై వారికి అవగాహన కల్పిస్తారని వెల్లడించారు. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు శిబిరం కొనసాగుతుందన్నారు.