• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఘనంగా గంగాదేవి తల్లి పండుగ

AKP: గొలుగొండ మండలం సీ.హెచ్‌. నాగాపురం గ్రామంలో గంగాదేవి తల్లి పండగను మంగళవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేసి సౌకర్యాలు కల్పించారు. పండుగ సందర్భంగా గ్రామంలో ఉత్సవ వాతావరణం నెలకొంది.

April 14, 2026 / 11:41 AM IST

తాడేపల్లిగూడెంలో ఘనంగా అగ్నిమాపక వారోత్సవాలు

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో విపత్తులు, అగ్నిమాపక దళ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం అవగాహనా వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన రహదారి గుండా ర్యాలీ నిర్వహించి, కరపత్రాలు పంపిణీ చేశారు. వేసవిలో అగ్నిప్రమాదల నివారణకు తీసుకోవాల్సిన చర్యలను ఫైర్ ఆఫీసర్ టి. శ్రీనివాస రావు వివరించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

April 14, 2026 / 11:38 AM IST

అంబేడ్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న సీఐ

VSP: డా,బి.ఆర్.అంబేద్కర్ 135వ, జయంతి సందర్భంగా డెంకాడ పోలీసు స్టేషన్ పరిధిలోని పాలెం గ్రామంలో భోగాపురం గ్రామీణ సీఐ జీ.రామకృష్ణ, ఎస్సై సన్యాసినాయుడు మంగళవారం జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా అంబేడ్కర్‌కు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపు లో పాల్గొన్నారు. అంబేడ్కర్ అడుగుజాడల్లో నడవాలని కోరారు.

April 14, 2026 / 11:38 AM IST

ప్రైవేటు స్కూళ్ల అడ్మిషన్ల ప్రకటనలతో జాగ్రత్త: డీఈవో

W.G: అనుమతులు లేని ప్రైవేటు పాఠశాలలు 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభిస్తున్నట్లు ఇచ్చే ప్రకటనలను నమ్మవద్దని డీఈవో నారాయణ తల్లిదండ్రులను హెచ్చరించారు. పాఠశాలకు గుర్తింపు ఉందో లేదో, భవన వసతులు సరిగా ఉన్నాయో లేదో సరిచూసుకోవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా ప్రకటనలు జారీ చేసే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు

April 14, 2026 / 11:28 AM IST

వైసీపీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి

AKP: అణగారిన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేశ్ అన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా నర్సీపట్నం పెద్దచెరువు వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశంలో సమానత్వం, స్వేచ్ఛ కోసం అంబేడ్కర్ చేసిన సేవలు అపారమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.

April 14, 2026 / 11:25 AM IST

అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దాం: కోట్ల

NDL: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ 135వ జయంతి సందర్భంగా ఇవాళ డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి బేతంచర్ల మండలం రేపల్లె గ్రామంలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేడ్కర్ సమానత్వం, సామాజిక న్యాయానికి చేసిన సేవలు అపారమని, ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

April 14, 2026 / 11:23 AM IST

రోసనూరులో అంబేద్కర్ విగ్రహావిష్కరణ

TPT: పెళ్లకూరు మండలం రోసనూరు గ్రామంలో ఈరోజు సాయంత్రం 4 గంటలకు భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అలాగే నియోజకవర్గ ఇంఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం గారు ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు.

April 14, 2026 / 11:22 AM IST

తిరువూరులో అంబేద్కర్ జయంతి వేడుకలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో వైసీపీ ఆధ్వర్యంలో బోసుబొమ్మ సెంటర్‌లో డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌చార్జ్ నల్లగట్ల స్వామిదాస్ పాల్గొని అంబేద్కర్ సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లోని పార్టీ ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు హాజరై నివాళులర్పించారు.

April 14, 2026 / 11:20 AM IST

జిల్లాలో ఈ సారి వానలు తక్కువే

CTR: జిల్లాలో రానున్న వర్షాకాలంలో తక్కువ వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.  ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో ఎక్కువ, మరి కొన్ని ప్రాంతాలలో తక్కువ నమోదు అయ్యే అవకాశం ఉందని పేర్కొంది. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలో తక్కువ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

April 14, 2026 / 11:20 AM IST

కర్లపాలెంలో పలు అంశాలపై గ్రామసభ

BPT: కర్లపాలెం గ్రామ పంచాయతీలో మంగళవారం గ్రామసభ నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంపీడీవో అద్దూరి శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సభను ఉద్దేశించి మాట్లాడారు. గ్రామ అభివృద్ధి, స్థానిక సమస్యల పరిష్కారం తదితర అంశాలపై ఈ సభలో చర్చించారు. ఈ కార్యక్రమంలో ఇంఛార్జ్ డిప్యూటీ ఎంపీడీవో పద్మావతి, కో ఆప్షన్ సభ్యులు అమీర్ బెగ్, అంగన్వాడీ సిబ్బంది ఉన్నారు.

April 14, 2026 / 11:20 AM IST

అమరావతి శాటిలైట్ మ్యాప్‌ విడుదల

GNTR: ప్రపంచ బ్యాంకు అమరావతి శాటిలైట్ మ్యాప్‌లను విడుదల చేసింది. ఇందులో 2024, 2026 సంవత్సరాల మధ్య వచ్చిన మార్పులను చూపించింది. రాజధాని ఫేజ్-1 పనులకు రూ.30 వేల కోట్లకు పైగా నిధులు అందుబాటులోకి వచ్చాయి. దీనికి గ్లోబల్ ఫండింగ్ సంస్థల నుంచి కూడా భారీ మద్దతు లభిస్తోంది. నిధుల రాకతో అమరావతి నిర్మాణం ప్రణాళికలకే పరిమితం కాకుండా ఆచరణ దశకు చేరుకుంది.

April 14, 2026 / 11:20 AM IST

పోలీసులపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు..!

సత్యసాయి: ధర్మవరంలో తనపై అక్రమ కేసు బనాయించి చిత్రహింసలకు గురిచేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని బాధితుడు ఓబుళరెడ్డి ఎస్పీ సతీష్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. జనసేన నేతపై నకిలీ పోస్టు సృష్టించిన వ్యక్తిని వదిలేసి, సంబంధం లేని తనను స్టేషన్‌కు తీసుకెళ్లి థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

April 14, 2026 / 11:18 AM IST

అనపర్తి కోర్టులో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

E.G: అంబేడ్కర్ జయంతి సందర్భంగా అనపర్తి జూనియర్ సివిల్ కోర్టు ప్రాంగణంలో జరిగిన వేడుకల్లో న్యాయమూర్తి వంశీకృష్ణ పాల్గొని అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని వంశీకృష్ణ అన్నారు. బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు, తదితరులు పాల్గొన్నారు.

April 14, 2026 / 11:17 AM IST

నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి

ASR: బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి, కుల వివక్షకు వ్యతిరేకంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ B.R. అంబేడ్కర్ చేసిన కృషి ఎనలేనిదని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి అన్నారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సమాజంలో నిమ్న వర్గాల అభివృద్ధే ధ్యేయంగా పని చేశారన్నారు.

April 14, 2026 / 11:15 AM IST

అగ్నిమాపక అమరవీరులకు నివాళులు

PPM: 1944 ముంబై నౌకా ప్రమాదంలో అమరులైన 66 మంది అగ్నిమాపక సిబ్బందిని స్మరించుకుంటూ జాతీయ సంతాప దినాలు ప్రారంభించింది. ఏప్రిల్14 నుంచి 21 వరకు వారంరోజులపాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఇన్‌చార్జ్ ఫైర్ ఆఫీసర్ ఆరిక సింహాచలం తెలిపారు. పాఠశాలలు, కాలేజీలు,పెట్రోల్ బంకులు, గ్యాస్ గోడౌన్‌లలో అగ్నిప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.

April 14, 2026 / 11:08 AM IST