• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

వ్యవసాయ క్షేత్రంలో పరిటాల సునీత

ATP: రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత వెంకటాపురం సమీపంలోని తన వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. నిత్యం రాజకీయ కార్యక్రమాలతో బిజీగా గడిపే ఆమె, తన పొలంలో సాగుతున్న పంటలను స్వయంగా పరిశీలించారు. పంటల ఎదుగుదల, సాగు విధానాల గురించి అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కొంతసేపు పొలంలో కలియతిరిగి మొక్కల పరిస్థితిని గమనించారు.

April 27, 2026 / 11:50 AM IST

ప్రేమ విఫలమై యువకుడు ఆత్మహత్యాయత్నం

PLD: సత్తెనపల్లి మండలంలోని భృగూబండ గ్రామంలో ప్రేమ విఫలమైందని జమాళ్లమూడి చందు (24) అనే యువకుడు ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఇది గమనించిన ఇంటి పక్కన వారు అతన్ని సత్తెనపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యుల కథనం ప్రకారం.. యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

April 27, 2026 / 11:43 AM IST

జనసేన కార్యాలయంలో ‘జనవాణి’ కార్యక్రమం

AKP: నాతవరం జనసేన పార్టీ కార్యాలయంలో ఇవాళ ‘జనవాణి’ కార్యక్రమం నిర్వహించారు. నర్సీపట్నం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ సూర్యచంద్ర ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మండలంలో మొత్తం 9 ఫిర్యాదులు అందాయని తెలిపారు. వై.వెంకయ్యపాలెం చెరువులో ఉపాధి హామీ పనులకు కొందరు ఆటంకం కలిగిస్తున్నారని ఫిర్యాదు వచ్చిందని, దీనిపై సంబంధిత అధికారులకు సమాచారం అందిస్తామని చెప్పారు.

April 27, 2026 / 11:41 AM IST

ఆమడగూరు తహసీల్దార్ రామ్నాథరెడ్డి కన్నుమూత

సత్యసాయి: ఆమడగూరు మండల తహసీల్దార్ రామ్నాథరెడ్డి సోమవారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నంద్యాలలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. రామ్నాథరెడ్డి కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని తెలియజేశారు.

April 27, 2026 / 11:40 AM IST

బంక్‌పై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

PLD: నరసరావుపేట రావిపాడులోని పెట్రోల్ బంక్‌ను కలెక్టర్ డా. కృతికా శుక్లా ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బంక్‌లో ఇంధన నిల్వలు, సరఫరా పరిస్థితులు, రికార్డులను స్వయంగా పరిశీలించారు. జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరిపడా నిల్వలు ఉన్నాయని, ఎక్కడా కొరత లేదని ఆమె స్పష్టం చేశారు. కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

April 27, 2026 / 11:34 AM IST

ఉపరాష్ట్రపతికి స్వాగతం పలికిన కేంద్ర మంత్రి

SKLM: భారత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ఇవాళ శ్రీకాకుళం నగరానికి భారత వాయుసేన ప్రత్యేక హెలికాప్టర్లో చేరుకున్నారు. డచ్ బంగ్లా హెలిపాడ్ వద్ద కేంద్ర పౌర విమాన యాన శాఖ మంత్రి కింజర రామ్మోహన్ నాయుడు ఉపరాష్ట్రపతికి సాదర స్వాగతం పలికారు. అనంతరం ఉపరాష్ట్రపతి ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్‌కి చేరుకున్నారు. అక్కడ నుంచి ఆయన నేరుగా శ్రీకూర్మం వెళ్తారని అధికారులు తెలిపారు.

April 27, 2026 / 11:33 AM IST

హీటెక్కిన ప్రొద్దుటూరు రాజకీయం

KDP: ప్రొద్దుటూరులో రాజకీయాలు హీటెక్కాయి. TDP, YCP నేతల మధ్య ప్రతిరోజూ మాటల యుద్ధం కొనసాగుతోంది. మధ్యలో మీడియాను, అధికారులను సైతం లాగుతున్నారు. అంతేకాకుండా MLA వరద, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు వర్గీయులు వ్యక్తిగత ఆరోపణలు చేసుకుంటూ దూషణలకు దిగుతున్నారు. ప్రైవేటు పంచాయితీలంటూ ఒకరిపై ఆరోపణలు చేసుకుంటున్నారు.

April 27, 2026 / 11:32 AM IST

నెల్లూరులో యాక్సిడెంట్.. యువకుడి స్పాట్ డెడ్

నెల్లూరు రూరల్ జొన్నవాడ బ్రిడ్జి ఆర్చి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైకును బొలెరో వాహనం ఢీకొట్టింది. బైక్‌పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడు కొండలపూడి గ్రామానికి చెందిన సునీల్ (25)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. ప్రమాదానికి గల వివరాలు తెలియాల్సి ఉంది.

April 27, 2026 / 11:31 AM IST

చెత్తను వేర్వేరుగా శానిటేషన్ సిబ్బంది అందించాలి: EO

VZM: తడి, పొడి చెత్తలను వేరుచేసి పంచాయతీ శానిటేషన్‌ వాహనాలకు అందజేయాలని ప్రజలకు, దుకాణదారులకు చీపురుపల్లి పంచాయితీ EO రూన్సీరాణి ఇవాళ సూచించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చెత్తను వేరు చేసేందుకు గతంలో పంచాయితీ అందజేసిన ప్లాస్టిక్‌ బుట్టలను ఉపయోగించాలన్నారు. చెత్తను వేరు చేసి ఇవ్వడం వల్ల సంపద కేంద్రాలు సమర్ధవంతంగా పని చేయగలవని తెలిపారు.

April 27, 2026 / 11:30 AM IST

రేపటి నుంచి వేసవి విజ్ఞాన శిబిరం ప్రారంభం

PPM: రేపటి నుంచి జూన్ 6 వరకు పాలకొండ శాఖా గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇవాళ గ్రంథాలయ అధికారి గణేష్ బాబు మాట్లాడుతూ.. ఈ వేసవి శిబిరం ప్రతి రోజూ ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు జరుగనుందన్నారు. ఈ శిబిరంలో కథలు వినుట, పుస్తక పఠనం, పుస్తక సమీక్షలు, చిత్ర లేఖనం, మట్టితో బొమ్మలు చేయటం,పేపర్‌ క్రాఫ్ట్‌, ఆటలు నిర్వహిస్తామన్నారు.

April 27, 2026 / 11:30 AM IST

ఎరువుల డీలర్లు ఒకరోజు బంద్..!

NTR: తిరువూరులోని ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, విత్తనాల డీలర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో దుకాణాలు ఇవాళ బంద్ నిర్వహించారు. దశాబ్దాలుగా ఎరువుల డీలర్ల విన్నపాలను పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం వివిధ విధానాలకు నిరసనగా ఒకరోజు బందు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా లింక్ ప్రొడక్ట్స్ లేకుండా ఎరువులు సరఫరా చేయాలని దుకాణాల యజమానులు డిమాండ్ చేశారు.

April 27, 2026 / 11:29 AM IST

గంగమ్మ తల్లి జాతర.. ట్రాఫిక్ ఆంక్షలు అమలు

NDL: ఉయ్యాలవాడ గ్రామంలో ఏప్రిల్ 28, 29 తేదీలలో జరగనున్న గంగమ్మ తల్లి జాతర సందర్భంగా, భక్తులు, ప్రయాణికుల సౌకర్యార్థం పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆళ్లగడ్డ నుంచి జమ్మలమడుగుకు వెళ్లే వాహనాలు దొర్నిపాడు, కోవెలకుంట్ల మార్గం ద్వారా వెళ్లాలని సూచించారు. జాతర సజావుగా సాగేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని ఇవాళ విజ్ఞప్తి చేశారు.

April 27, 2026 / 11:28 AM IST

బంకుల వద్ద మారని తీరు.. తీరని ఇంధన కొరత.!

కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పెట్రోల్, డీజిల్ కొరత సమస్య కొనసాగుతోంది. ఇవాళ కూడా పలు పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు భారీగా క్యూ కట్టారు. ఇంధనం సరఫరా సరిగ్గ లేకపోవడంతో గంటల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. కొన్నిచోట్ల నిల్వలు త్వరగా ఖాళీ కావడంతో నిరాశకు గురవుతున్నారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

April 27, 2026 / 11:26 AM IST

విశాఖలో వీఐపీల రాక

విశాఖపట్నంలో ఇవాళ వీఐపీల రాకతో నగరం కిటకిటలాడింది. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ INS డేగా‌కు చేరుకోగా అధికారులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. మరోవైపు గవర్నర్ అబ్దుల్ నజీర్ విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని స్వాగతం అందుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు.

April 27, 2026 / 11:24 AM IST

పెట్రోల్ బంకులను పరిశీలించిన సబ్ కలెక్టర్

GNTR: తెనాలిలోని పెట్రోల్ బంకులలో ఇవాళ ఉదయం అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సబ్ కలెక్టర్ లక్ష్మీ కుమారి, MRO గోపాలకృష్ణ, ఎస్సై కరిముల్లా, సివిల్ సప్లై అధికారులు కలిసి పెట్రోల్ బంకులను సందర్శించారు. చాలా బంకుల్లో డీజిల్ ఫిల్లింగ్ నిలిపివేయడంపై యజమానులను ప్రశ్నించారు. వాహనదారులతో మాట్లాడి ఇబ్బందులను తెలుసుకున్నారు.

April 27, 2026 / 11:23 AM IST