• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘గిరిజనులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి’

PPM: జిల్లాలోని అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ బీమా పథకాలు వర్తించేలా బ్యాంకర్లు ప్రత్యేక దృష్టి సారించాలని జేసీ యశ్వంత్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్‌లో బ్యాంకర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సామాజిక భద్రత కల్పించడంలో భీమా పథకాలు కీలకమని పేర్కొన్నారు. ముఖ్యంగా రైతులు స్వయం సహాయక సంఘాల సభ్యులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

April 28, 2026 / 09:00 PM IST

కోనేరు ఆక్రమణలకు నిరసనగా నాలుగో రోజు ధర్నా

NTR: నందిగామలో కోనేరు ఆక్రమణకు వ్యతిరేకంగా హిందూ సంఘాల నిరసన నాలుగో రోజుకు చేరింది. రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన కోనేరు స్వామివారి వశంలోకి ఇవ్వాలని కోరుతూ.. భక్తిశ్రద్ధలతో శాంతియుత నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, “ఓం నమశ్శివాయ” నామస్మరణతో భజనలు చేశారు. అనంతరం స్వామివారికి వినతిపత్రం సమర్పించారు.

April 28, 2026 / 08:46 PM IST

‘ఏబీఎన్ రాధాకృష్ణ పై చర్యలు తీసుకోండి’

SKLM: ఏబీఎన్ రాధాకృష్ణపై తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా వైసీపీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం జిల్లా నాయకులతో కలిసి ఎస్పీ కార్యాలయంలో సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈనెల తొమ్మిదవ తేదీన రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశామని, ఇంతవరకు చర్యలు తీసుకోకూడదు మరోసారి ఫిర్యాదు చేస్తున్నామని పేర్కొన్నారు.

April 28, 2026 / 08:43 PM IST

పోరంకిలో CMRF చెక్కులు అందజేత

కృష్ణా: పెనమలూరు మండలం పోరంకిలో సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు MLA బోడె ప్రసాద్ మంగళవారం అందజేశారు. ఆరోగ్యమే మహాభాగ్యమని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని MLA సూచించారు. వయస్సుకు అనుగుణంగా జీవనశైలి, ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని, స్తోమత ఉన్నవారు ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.

April 28, 2026 / 08:39 PM IST

తాళ్లరేవులో పెట్రోల్ బంకును తనిఖీ చేసిన కలెక్టర్

KKD: జిల్లాలో డీజిల్ సరఫరాలో వరి కోత యంత్రాలకు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నట్లు కలెక్టర్ హరేంధర్ ప్రసాద్ తెలిపారు. మంగళవారం తాళ్లరేవులోని హెచ్పీసీఎల్ బంకును తనిఖీ చేసిన ఆయన, కూపన్ ద్వారా రైతులకు 70 లీటర్ల వరకు డీజిల్ పంపిణీ చేయాలని సూచించారు. రైతులు మినహా ఇతరులెవరికీ డబ్బాలు లేదా బాటిళ్లలో ఇంధనం విక్రయించవద్దని బంకు యజమానులను ఆదేశించారు.

April 28, 2026 / 08:36 PM IST

జిల్లా రుణ ప్రణాళిక అంచనా రూ.13,833 కోట్లు

సత్యసాయి జిల్లా 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక రుణ ప్రణాళిక (పీఎల్‌పీ) పుస్తకాన్ని కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ ఆవిష్కరించారు. జిల్లాలో మొత్తం ప్రాధాన్యతా రంగాల రుణ సామర్థ్యాన్ని రూ. 13,833.66 కోట్లుగా అంచనా వేశారు. ఇందులో అత్యధికంగా వ్యవసాయ రంగానికి రూ. 9,365.64 కోట్లు, ఎంఎస్ఎంఈ రంగానికి రూ. 3,457.65 కోట్లు కేటాయించారు.

April 28, 2026 / 08:34 PM IST

జనగణనలో స్వీయ గణన నమోదు చేసుకోండి: ఎమ్మెల్యే

KRNL: జనగణనలో భాగంగా ప్రతి కుటుంబం స్వీయ గణన నమోదు చేసుకోవాలని ఆదోని MLA పార్థసారథి కోరారు. ఆన్లైన్ ద్వారా వివరాలు నమోదు చేయవచ్చని, సమాచారం గోప్యంగా ఉంటుందని తెలిపారు. 10–15 నిమిషాల్లో ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. ఏప్రిల్ 30లోపు నమోదు పూర్తి చేయాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో MRO శేషఫణి, ఏఎస్ఓ వెంకటేశ్వర్లు, వీఆర్వో రాజశేఖర్ ఉన్నారు.

April 28, 2026 / 08:32 PM IST

మహిళ భద్రతపై ఎస్సై ప్రియాంక అవగాహన

TPT: శ్రీసిటీలో మహిళ భద్రతపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఎస్సై ప్రియాంక మహిళలకు ధైర్యం నింపారు. “భయపడొద్దు పోలీస్ మీతోనే ఉంది” అంటూ ఆమె భరోసా కల్పించారు. KGI కంపెనీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళల రక్షణకు సంబంధించిన పలు సూచనలు చేశారు. పోలీసులు ఎప్పుడూ మహిళల భద్రత కోసం సిద్ధంగా ఉంటారని తెలిపారు.

April 28, 2026 / 08:30 PM IST

మందపల్లి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్‌గా సుబ్బలక్ష్మి

కోనసీమ: కొత్తపేట మండలం మందపల్లి శనీశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్‌గా బీజేపీ నాయకురాలు కోటిపల్లి సుబ్బలక్ష్మి నియమితులయ్యారు. ఈ మేరకు విజయవాడ దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదలైనట్లు ఆమె తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీ నాయకులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

April 28, 2026 / 08:30 PM IST

తాగునీటి సరఫరాకు అంతరాయం

CTR: పలమనేరు మున్సిపల్ పరిధిలో రెండు రోజులపాటు తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్య నీటి వనరు అయిన కాలువ పల్లె రిజర్వాయర్ నీటి సరఫరా పైప్ లైన్ లీకేజీల మరమ్మత్తుల కారణంగా ఈ అంతరాయం ఉంటుందన్నారు. ప్రజలు దీనిని గుర్తించి సహకరించాలని కోరారు.

April 28, 2026 / 08:30 PM IST

డీజిల్ పక్కదారి పట్టకుండా చూడాలి: కలెక్టర్

ELR: బంకుల వద్ద డీజిల్ పక్కదారి పట్టకుండా సిబ్బందిని నియమించి డీజిల్ సక్రమంగా సరఫరా అయ్యేలా పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. డీజిల్ కొరతపై మంగళవారం అధికారులు, తహశీల్దార్లతో కలెక్టర్ టెలీకాన్ఫెరెన్స్ ద్వారా సమీక్షించారు. బంక్ వద్ద సిబ్బందిని నియమయించి డీజిల్ సరఫరా సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.

April 28, 2026 / 08:30 PM IST

కడపలో టెక్స్‌టైల్ విజన్–2030పై కలెక్టర్ సమీక్ష

KDP: టెక్స్‌టైల్ ఎగుమతుల విజన్–2030 అమలుపై కలెక్టర్ శ్రీధర్ సమీక్ష నిర్వహించారు. జౌళి రంగాన్ని బలోపేతం చేసి, చేనేత ఉత్పత్తుల ఎగుమతులను పెంచాలని అధికారులకు సూచించారు. కొత్త యూనిట్ల స్థాపనకు ప్రోత్సాహం ఇవ్వాలని, జిల్లాలో ఉన్న వనరులను సమర్థంగా వినియోగించుకోవాలని అన్నారు. 2030కి రు.100 బిలియన్ లక్ష్యంలో జిల్లాల భాగస్వామ్యం అవసరమన్నారు.

April 28, 2026 / 08:30 PM IST

మామిడి పంట మెరుగుదలపై కలెక్టర్ సమీక్ష

TPT: జిల్లాలో మామిడి పంట పరిస్థితులపై జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ సమీక్ష నిర్వహించారు. గతేడాదికంటే ఈ ఏడాది దిగుబడి మెరుగ్గా ఉండే అవకాశముందని తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పక్వానికి వచ్చిన కాయలనే కోయాలని సూచించారు. ప్రాసెసింగ్ యూనిట్లు రైతులతో సమన్వయం చేసుకుని న్యాయమైన ధరలు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

April 28, 2026 / 08:29 PM IST

‘జెట్రో-ఏయూ భాగస్వామ్యం’

VSP: జపాన్ ఎక్స్‌టర్నల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రతినిధి బృందం ఆంధ్ర యూనివర్సిటీను సందర్శించింది. ఈ సందర్భంగా జపాన్ కంపెనీల్లో విద్యార్థుల నియామకాలు, ఫ్యాకల్టీ-స్టూడెంట్ ఎక్స్చేంజ్‌పై చర్చలు జరిపింది. జపాన్ విద్యార్థులకు ఏయూలో ప్రవేశాలు, భాషా తరగతులు, సంయుక్త సదస్సులపై ప్రతిపాదనలు వెల్లువెత్తాయి.

April 28, 2026 / 08:29 PM IST

‘రోడ్డు విస్తరణ పనులలో స్పీడ్ పెంచండి’

GNTR: నగరంలో పెండింగ్‌లో ఉన్న రోడ్డు విస్తరణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కమిషనర్ కే. మయూర్ అశోక్ ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులకు ఆదేశించారు. రెడ్డిపాలెం–నందివెలుగు రోడ్, ఏటీ అగ్రహారం ప్రాంతాల్లో పనులను పరిశీలించారు. వాసవి నగర్‌లో లేఅవుట్ అప్లికేషన్‌ను సమీక్షించి, పలు ప్రాంతాల్లో పారిశుధ్య పనులపై అధికారులకు సూచనలు ఇచ్చారు.

April 28, 2026 / 08:27 PM IST