• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

6 సెంటర్లలో NEET పరీక్షలు

ప్రకాశం: ఒంగోలులో వచ్చే నెల 3న NEET పరీక్ష జరగనుంది. ఈ నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ పీ.రాజాబాబు ఆదేశించారు. నగరంలోని 6 కేంద్రాల్లో 1,728 మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తారని చెప్పారు. మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. కేంద్రాల్లో విద్యుత్, తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించాలని సూచించారు.

April 29, 2026 / 10:22 PM IST

వైభవంగా అంకమ్మ తల్లి దేవస్థాన ప్రతిష్టా కార్యక్రమం

PLD: మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో బుధవారం అంకమ్మ తల్లి నూతన దేవాలయం ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంకమ్మ తల్లి అమ్మవారి విగ్రహ ప్రాణ ప్రతిష్ట, దేవాలయ ప్రాంగణంలో పోతురాజు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అమ్మవారిని ప్రత్యేక పూలతో సుందరంగా అలంకరించి మహిళలు కుంకుమ పూజలు నిర్వహించారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

April 29, 2026 / 09:16 PM IST

అమలాపురంలో ఇంధన కొరత పరిష్కారం

కోనసీమ: అమలాపురంలో డీజిల్, పెట్రోల్ కొరత సమస్య పూర్తిగా పరిష్కారమైందని జిల్లా అధికారులు తెలిపారు. ఆయిల్ కంపెనీల సమన్వయంతో సరఫరా వ్యవస్థను పునరుద్ధరించి సాధారణ స్థితికి తీసుకువచ్చారు. జిల్లాలోని అన్ని పెట్రోల్ బంకుల్లో తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని, పానిక్ కొనుగోళ్లు చేయవద్దని అధికారులు ప్రజలకు సూచించారు.

April 29, 2026 / 09:00 PM IST

జనగణన-2027పై కలెక్టర్ కీలక ఆదేశాలు

VSP: జనగణన-2027ను సమర్థంగా నిర్వహించాలని కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్వీయ గణన ఇప్పటివరకు 86.49% మాత్రమే పూర్తైందని, దాన్ని 100%కు తీసుకెళ్లాలని చెప్పారు. మే 1 నుంచి ప్రధాన ప్రక్రియకు సమన్వయం అవసరమన్నారు. సిబ్బంది తప్పనిసరిగా రోజువారీ పురోగతి పర్యవేక్షణ చేయాలని సూచించారు.

April 29, 2026 / 08:57 PM IST

ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్

కృష్ణా: పామర్రు పోలీస్ స్టేషన్‌ ఎస్సైగా కే.శ్రీనివాస్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. పోలీస్ సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తానని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.

April 29, 2026 / 08:47 PM IST

టేక్వాండో పోటీలు ప్రారంభం

TPT: క్రీడలు ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ పెంపొందిస్తాయని తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి అన్నారు. తిరుపతిలోని స్మాష్ పాయింట్ ఇండోర్ హాల్‌లో 5వ ఏపీ స్టేట్ క్యాడెట్ & సీనియర్ టేక్వాండో ఛాంపియన్‌ షిప్-2026ను ఆయన ప్రారంభించారు. టేక్వాండో ఆత్మరక్షణకు ఎంతో ఉపయోగకరమని, క్రీడలు విద్యార్థుల్లో మనోధైర్యాన్ని పెంచుతాయని పేర్కొన్నారు.

April 29, 2026 / 08:39 PM IST

కలెక్టర్‌కు జనసేన నేత వినతి పత్రం

CTR: జనసేన నేత డా. యుగంధర్ పొన్న జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్‌ను కలిసి పలు సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. కార్వేటినగరం మండలంలోని గాజంకి, ఆర్కేవీబీ పేట ప్రాంతాల్లో మినరల్ వాటర్ ప్లాంట్ల ఏర్పాటు, కొల్లగుంట గ్రామపంచాయతీ పరిధిలో పలు కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు. సమస్యలను సానుకూలంగా విన్న కలెక్టర్ తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

April 29, 2026 / 08:36 PM IST

పేకాట శిబిరంపై పోలీసుల దాడి..!

ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో జూద స్థావరాలపై పోలీసులు దాడి చేశారు. రహస్య సమాచారంతో ఎస్సై శాతకర్ణి బృందం చిట్యాల శివారులో కొబ్బరి తోట దగ్గర ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించింది. అక్కడ “కోతముక్క” జూదం ఆడుతున్న వారిని గుర్తించి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.14,050 నగదు, 52 పేకముక్కలు స్వాధీనం చేసుకున్నారు.

April 29, 2026 / 08:35 PM IST

నిబంధనలు మీరితే ‘జైలు’కే: ఎస్సై

ప్రకాశం: పొదిలి పెద్ద బస్టాండులో ఎస్సై సూరెడ్డి రాజేష్ బుధవారం వాహన తనిఖీలు నిర్వహించారు. రోడ్డు నిబంధనలు ఉల్లంఘించే వారిపై ఇకపై ఎలాంటి మినహాయింపులు ఉండవని తెలిపారు. ముఖ్యంగా మద్యం సేవించి వాహనం నడిపితే కేవలం జరిమానాతో వదిలిపెట్టే రోజులు ముగిశాయని, అలాంటి వారు దొరికితే కౌన్సెలింగ్ అనంతరం నేరుగా రిమాండ్‌కు పంపిస్తామని స్పష్టం చేశారు.

April 29, 2026 / 08:35 PM IST

‘పాత్రికేయులకు భద్రత కల్పించాలి’

PPM: రాష్ట్రంలో పాత్రికేయులు పట్ల జరుగుతున్న దాడులను అరికట్టాలని పార్వతీపురం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ బత్తిన మోహన్ కోరారు. కూటమి ప్రభుత్వంలో ఇటీవల కాలంలో రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో పాత్రికేయుల పట్ల దాడులు, కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నవని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా సాలూరులో సాక్షి విలేకర్ పై దాడిని ఖండించారు.

April 29, 2026 / 08:30 PM IST

జిల్లాలో పింఛన్ల పంపిణీకి సర్వం సిద్ధం

సత్యసాయి: జిల్లాలో మే 1న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీకి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 37 మండలాలు, మున్సిపాలిటీల్లోని 544 సచివాలయాల పరిధిలో మొత్తం 2,60,214 మంది లబ్ధిదారులకు పింఛన్లు అందజేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ. 114.90 కోట్లు విడుదల చేసింది.

April 29, 2026 / 08:30 PM IST

డిజిటల్ నెర్వ్ సెంటర్ విజయవంతం

CTR: కుప్పంలో అమలవుతున్న డిజిటల్ నెర్వ్ సెంటర్ ద్వారా రోగుల వైద్య రికార్డులను ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో అనుసంధానం చేసి మంచి ఫలితాలు సాధిస్తున్నామని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా అన్ని సేవలను ఒకే ప్లాట్‌ఫారమ్‌పై అందుబాటులోకి తీసుకువచ్చి ఆరోగ్య సేవలను మెరుగుపరుస్తున్నట్లు వెల్లడించారు.

April 29, 2026 / 08:29 PM IST

‘సెల్ ఫోన్లు వదలండి పుస్తకాలు పట్టండి’

GNTR: మంగళగిరి పౌర శాఖ గ్రంథాలయంలో ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ భీమనేని వందనాదేవి ప్రత్యేకంగా హాజరై విద్యార్థులను ప్రోత్సహించారు. మొత్తం 102 మంది విద్యార్థి విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొని, వివిధ అంశాలలో మంచి పరిజ్ఞానం సంపాదించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు. సెల్ ఫోన్లు వదలండి పుస్తకాలు పట్టండి అంటూ విద్యార్థులకు సూచించారు.

April 29, 2026 / 08:25 PM IST

రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

AKP: ఎస్ రాయవరం మండలంలో బుధవారం వేర్వేరుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందినట్లు ఎస్సై రమేష్ తెలిపారు. అడ్డరోడ్డు నుంచి ఎలమంచిలి వెళుతున్న బైక్ హ్యాండిల్ లారీకి తగలడంతో బైక్ పై వెనక కూర్చున్న షణ్ముఖరావు అనే యువకుడు కిందపడి మృతి చెందినట్లు తెలిపారు. అలాగే, అడ్డరోడ్డు జంక్షన్లో ఆర్టీసీ బస్సు నుంచి జారిపడిన తీవ్రంగా గాయపడిన మహిళ కాసులమ్మ మృతి చెందిందన్నారు.

April 29, 2026 / 08:22 PM IST

దగదర్తి మండలంలో పర్యటించనున్న కలెక్టర్

NLR: దగదర్తి మండలంలో నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా గురువారం పర్యటించనున్నారు. అనంతవరంలో జరిగే ‘పల్లె వీక్షణ’కు హాజరవుతారు. గ్రామంలోని ఉపాధి హామీ పనులు, హౌసింగ్ లేఅవుట్లు, అంగన్వాడీ కేంద్రాలను కలెక్టర్ స్వయంగా పరిశీలిస్తారు. ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుంటారు.

April 29, 2026 / 08:20 PM IST