• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

గిరిజన ఉపాధ్యాయుల సదస్సుకు పిలుపు

ASR: రాష్ట్ర స్థాయి విద్యా సదస్సును విజయవంతం చేయాలని డుంబ్రిగూడ యూటీఎఫ్ నాయకులు పిలుపునిచ్చారు. డుంబ్రిగుడలో బుధవారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈనెల 12న రంపచోడవరంలో 6వ రాష్ట్రస్థాయి గిరిజన సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆశ్రమ, జీపీఎస్ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత, కనీస వసతుల లేమి, అదనపు బాధ్యతలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.

April 8, 2026 / 04:11 PM IST

మదనపల్లె–అరుణాచలం ప్రత్యేక రైలు ప్రారంభం

అన్నమయ్య: మదనపల్లె నుంచి తిరువన్నామలైకు ప్రతి మంగళవారం ప్రత్యేక రైలు సౌకర్యాన్ని రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది. ట్రైన్ నం.17165 తెల్లవారుజామున 01:05 గంటలకు బయలుదేరి ఉదయం 07:28 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. భక్తులకు అనుకూలంగా ఈ సేవలను ప్రారంభించగా, తక్కువ ధరలతో ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుందని అధికారులు తెలిపారు.

April 8, 2026 / 04:06 PM IST

కనకదుర్గమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే

SKLM: విజయవాడలో ప్రసిద్ధి గాంచిన ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు, అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు వేదమంత్రాల మధ్య ఎమ్మెల్యేని ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.

April 8, 2026 / 03:44 PM IST

బూడిద గుమ్మడికాయ రైతుల ఆవేదన

KRNL: ఆలూరు(మం) ముద్దునగేరిలో బూడిద గుమ్మడికాయ రైతులు ధరలు లేక ఆవేదన చెందుతున్నారు. ఎకరానికి రూ. లక్ష వరకూ పెట్టుబడి పెడితే కనీసం పెట్టుబడి రావడం లేదన్నారు. మార్కెట్‌లో కిలో రూ.2 ధర మాత్రమే పలుకుతోందన్నారు. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి తమను ఆదుకోవాలని వారు కోరారు.

April 8, 2026 / 03:42 PM IST

గోదావరిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

W.G: నరసాపురం(మం) మాధవాయిపాలెం సమీపంలోని గోదావరి నదిలో సుమారు 30 ఏళ్ల వయస్సున్న గుర్తుతెలియని మృతదేహం బుధవారం లభ్యమైంది. తుమ్మచెట్టు ప్రాంతంలో మృతదేహం నదిలో నీటిపై తేలుతుండటాన్ని గమనించిన వీఆర్వో కొప్పినీడి వెంకట సత్యనారాయణ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతుడి వివరాల కోసం ఆరా తీస్తున్నారు.

April 8, 2026 / 03:40 PM IST

విద్యుత్ సమస్యలపై అవగాహన సదస్సు

AKP: మాకవరపాలెం మండలం శెట్టిపాలెంలో విద్యుత్ సమస్యలపై అవగాహన సదస్సు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పీఎం సూర్యఘర్ పథకం, ప్రతి ఇంటిపై సోలార్ ప్యానల్స్ సబ్సిడీ గురించి అధికారులు వివరించారు. ఇందులో నర్సీపట్నం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్.రామకృష్ణ, డిప్యూటీ ఇంజనీర్ కేవి.త్రినాథ్, ఏఈ బాలకృష్ణ, మాజీ సర్పంచ్ అల్లు రామునాయుడు పాల్గొన్నారు.

April 8, 2026 / 03:36 PM IST

యువత పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి: మంత్రి సవిత

GNTR: యువత పారిశ్రామిక వేత్తలుగా ఎదిగి, మరింత మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత పిలుపునిచ్చారు. నాగార్జున యూనివర్శిటీలోని డాక్టర్ హెచ్.హెచ్.డైక్ మన్ ఆడిటోరియంలో బుధవారం నిర్వహించిన ఎంఎస్ఎంఈ పార్కుల్లో ఈడబ్ల్యూఎస్ వర్గీయులకు అవకాశాలపై ఒకరోజు అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు.

April 8, 2026 / 03:30 PM IST

విద్యాశాఖ అధికారులు నిద్రమత్తు వీడాలి: ఏఐవైఎఫ్

NDL: వెంకటేశ్వర విద్యా మందిర్ స్కూల్లో విద్యార్థినిపై జరిగిన అఘాయిత్యాలపై జిల్లా విద్యాశాఖ అధికారులు నిద్రమత్తు వీడాలని AIYF నంద్యాల జిల్లా కార్యదర్శి నాగరాముడు, అధ్యక్షుడు ఎర్రిస్వామి అన్నారు. అఘాయిత్యాలపై విచారణ చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నంద్యాలలో ధర్నా చేశారు.

April 8, 2026 / 03:29 PM IST

పెద్దకడబూరు రెగ్యులర్ తహసీల్దార్‌గా వలిబాషా

KRNL: పెద్దకడబూరు మండల రెగ్యులర్ తహసీల్దార్‌గా పీ.వలిబాషాను నియమిస్తూ కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన ఎమ్మిగనూరులో డిప్యూటీ తహసీల్దార్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రమోషన్ నేపథ్యంలో ఆయనను పెద్దకడబూరు మండలానికి నియమించారు. త్వరలోనే ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.

April 8, 2026 / 03:26 PM IST

ఒక్కసారిగా నేలకొరిగిన భారీ వృక్షం

ELR: దెందులూరు నియోజకవర్గ పరిధిలోని వట్లూరులో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలో ఓ భారీ వృక్షం ఒక్కసారిగా కుప్పకూలింది. ఎంతో కాలంగా ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న ఈ వృక్షం విరిగిపడిపోవడంతో స్థానికులు, అటుగా వెళ్తున్న వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. అధికారులు స్పందించి రోడ్డుపై ఉన్న ఈ చెట్టుని తొలగించాలని కోరారు.

April 8, 2026 / 03:24 PM IST

మాజీ మంత్రి హౌస్ అరెస్ట్

SKLM: మహిళలను ఉద్దేశించి ABN రాధాకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు శ్రీకాకుళంలోని ABN కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. బుధవారం కాశీబుగ్గ పోలీసులు ఆయనను ఇంటి వద్దే ఆపి హౌస్ అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కు కూడా ప్రజలకు లేకుండా చేస్తున్నారని ఆరోపించారు.

April 8, 2026 / 03:21 PM IST

పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

W.G: వీరవాసరం (మం) తోలేరు గ్రామంలోని రైతు సేవ కేంద్రం వద్ద బుధవారం గ్రామ సభ, పునఃసర్వేలో కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా రాజముద్ర పట్టాదారు పాస్ పుస్తకాలతో రైతన్నలకు ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తప్పులను సరిదిద్ది భూ వివాదాలు లేకుండా చేయడమే కూటమి ప్రభుత్వ కర్తవ్యమని చెప్పుకొచ్చారు.

April 8, 2026 / 03:21 PM IST

అనంతపురంలో నిరసనకు దిగిన వైసీసీ నేతలు

ATP: మహిళలపై ఏబీఎన్ రాధాకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అనంతపురంలోని ఏబీఎన్ కార్యాలయం వద్ద వైసీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ గౌడ్ ఆందోళన చేపట్టారు. వైసీపీ నేతల కుటుంబ సభ్యులపై నీచమైన రాతలు రాశారంటూ మండిపడ్డారు. మహిళల వ్యక్తిత్వాన్ని హననం చేసేలా వ్యవహరించడం దుర్మార్గమని విమర్శించారు. రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

April 8, 2026 / 03:20 PM IST

‘వేస్ట్ టు వండర్’ పోటీలు

VSP: స్వచ్ఛ సర్వేక్షన్ 2025-26లో భాగంగా జీవీఎంసీ నిర్వహిస్తున్న “వేస్ట్ టు వండర్” పోటీలకు ఏప్రిల్ 24 చివరి తేదీగా నిర్ణయించినట్లు బుధవారం కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ఇందులో స్క్రాప్‌తో 4-8 అడుగుల శిల్పాలు రూపొందించి సమర్పించాలన్నారు. ఇందులోని ఉత్తమ కళా ఖండాలను నగరంలోని ప్రధాన కూడళ్లలో ప్రతిష్ఠించనున్నట్లు పేర్కొన్నారు.

April 8, 2026 / 03:11 PM IST

3 వేల మందికి అన్నదాన కార్యక్రమం

GNTR: తెనాలి వైకుంఠపురం సమీపంలోని పోలేరమ్మ తల్లి దేవస్థానం 28వ వార్షికోత్సవ సందర్భంగా బుధవారం ఉదయం ప్రత్యేక పూజలు చేశారు. గుంటి వెంకట్ ఆధ్వర్యంలో 3 వేల మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ నాయకులు కుద్దూస్, త్రిమూర్తి, జొన్నాదుల మహేష్, వెంకటేష్, అఖిల్, షావుల్ తదితరులు పాల్గొన్నారు.

April 8, 2026 / 03:08 PM IST