• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ముగిసిన గుమ్మనూరు మెగా క్రికెట్ టోర్నమెంట్

ATP: గుత్తి మండలం రజాపురం గ్రామంలో శనివారం జరుగుతున్న గుమ్మనూరు మెగా క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ కార్యక్రమానికి ఎమ్మెల్యే జయరాం తనయుడు గుత్తి, పామిడి మండల ఇన్‌ఛార్జ్ గుమ్మనూరు ఈశ్వర్ హాజరయ్యారు. అనంతరం క్రీడాకారులతో కలిసి కాసేపు క్రికెట్‌ను ఆడారు. ఈశ్వర్ మాట్లాడుతూ.. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు ఉత్తేజాన్ని ఇస్తాయన్నారు. గెలుపు, ఓటములు సహజమన్నారు.

April 25, 2026 / 06:11 PM IST

మార్కాపురం నుంచి బ్రహ్మంగారిమఠంకి RTC సర్వీసులు

ప్రకాశం: కడప జిల్లా పోరుమామిళ్లలో జరుగుతున్న బ్రహ్మంగారిమఠం ఆరాధనల సందర్భంగా భక్తుల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా మార్కాపురం ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. డిపో నుంచి మఠం వరకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు డిపో మేనేజర్ వెల్లడించారు. బస్సుల సమయాలు, ఇతర వివరాల కోసం ఎంక్వయిరీ కౌంటర్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

April 25, 2026 / 06:09 PM IST

అధికారులకు జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు

ELR: కైకలూరు నియోజకవర్గం స్థాయిలో వివిధ శాఖలు అధికారులతో జిల్లా కలెక్టరు కె. వెట్రిసెల్వి అధ్యక్షతన శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టరుతో పాటు ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ పాల్గొన్నారు. వేసవి దృష్ట్యా ఎక్కడా త్రాగునీటి సమస్య ఎక్కడ తలెత్తకూడదు, రెండు పూటలు పుష్కలంగా ఇవ్వాలి. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు.

April 25, 2026 / 06:05 PM IST

GGH విద్యార్థినుల హాస్టళ్లలో కలెక్టర్ తనిఖీలు

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని మెడికల్ కళాశాల విద్యార్థినుల హాస్టళ్లను శనివారం జిల్లా కలెక్టర్ డా.సిరి తనిఖీ చేశారు. హాస్టల్ గదులు, భోజనశాల, పారిశుద్ధ్యం, తాగునీటి సదుపాయాలను పరిశీలించి విద్యార్థినులతో మాట్లాడారు. భద్రత, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. DMHO వెంకటేశ్వర్లు, ప్రిన్సిపల్ చిట్టి నరసమ్మ పాల్గొన్నారు.

April 25, 2026 / 05:49 PM IST

డ్రగ్స్ వద్దు బ్రో అవగాహనకు వేగం

అన్నమయ్య: జిల్లాలో మాదకద్రవ్యాలను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు సమన్వయంతో చర్యలు చేపట్టాలని కలెక్టర్ నిశాంత్ అధికారులను ఆదేశించారు. యువతను డ్రగ్స్ బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలని సూచించారు. టోల్ ఫ్రీ నెంబర్ 1972పై సమాచారం అందించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జిల్లాలో ఇప్పటికే కేసులు నమోదు చేసి గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

April 25, 2026 / 05:46 PM IST

ప్రభుత్వ ఆసుపత్రిను పరిశీలించిన కలెక్టర్

ELR: కైకలూరు సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం జిల్లా కలెక్టరు కె. వెట్రిసెల్వి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వార్డులు పరిశీలించి పేషెంట్లు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వైద్యసేవలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. ప్రభుత్వ వైద్యులు మంచి వైద్యసేవలు అందించి రోగులలో నమ్మకాన్ని పెంపొందించు కోవాలన్నారు. నిరుపేద రోగులు ప్రైవేటు హాస్పిటల్స్‌కు వెళ్ళకుండా చూడాలన్నారు.

April 25, 2026 / 05:44 PM IST

జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీ సమావేశం

E.G: జిల్లా కోర్ట్ ఆవరణలో జిల్లాన్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్.శ్రీ లక్ష్మీ జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీ సమావేశం శనివారం నిర్వహించారు. హిట్ & రన్ యాక్సిడెంట్ కేసుల్లో బాధితులకు పరిహారం అందించే విషయంలో గౌరవ సుప్రీం కోర్టు వారి ఆదేశాలను అనుసరించాలని అన్నారు. రెవెన్యూ & పోలీసు అధికారులు కమిటీలో సభ్యులుగా ఉంటారని తెలిపారు.

April 25, 2026 / 05:43 PM IST

కనేకల్లులో మహిళా భద్రతపై అవగాహన

ATP: రాయదుర్గం నియోజకవర్గం కనేకల్లులో మహిళలు, చిన్నారుల భద్రతపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆదేశాల మేరకు డీఎస్పీ రవిబాబు నేతృత్వంలో ఈ సదస్సు జరిగింది. మహిళలపై జరుగుతున్న నేరాలు, గృహహింస, సైబర్ మోసాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులు వివరించారు.

April 25, 2026 / 05:38 PM IST

చిలకపాటి భరద్వాజాచార్యుల మృతికి చదలవాడ నివాళులు

PLD: నాదెండ్ల మండలం, సాతులూరు గ్రామంలో కీ.శే. చిలకపాటి భరద్వాజాచార్యుల అకాల మరణంపై నరసరావుపేట శాసనసభ్యులు చదలవాడ అరవింద బాబు విచారం వ్యక్తం చేశారు. ఆయన భౌతికకాయానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి సేవలను గుర్తుచేసుకున్నారు.

April 25, 2026 / 05:36 PM IST

ఈనెల 27 నుంచి శ్రీవీరేశ్వర స్వామి కళ్యాణోత్సవాలు

కోనసీమ: మురముళ్ల శ్రీవీరేశ్వర స్వామి క్షేత్ర పాలకుడు లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణోత్సవాలు ఈ నెల 27 నుంచి మే 1 వరకు జరుగుతాయని ఆలయ ఏసీ సత్యనారాయణ శనివారం తెలిపారు. సోమవారం సాయంత్రం 6:45 గంటలకు కళ్యాణం ప్రారంభమవుతుంది. మే 1న ఉదయం పూర్ణాహుతి, చక్రస్నానం, సాయంత్రం శ్రీపుష్ప యాగం నిర్వహిస్తారు. ఏప్రిల్ 30న నరసింహ జయంతి వేడుకలు జరగనున్నాయి.

April 25, 2026 / 05:35 PM IST

కోవూరు ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్, ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ

NLR: కోవూరు MLA ప్రశాంతి రెడ్డి, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాతో కలిసి కోవూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆసుపత్రిలోని లాబొరేటరీ ఫార్మసీ స్టోర్, ఆఫీసు రూమ్లను సందర్శించారు. అక్కడ ఉన్న స్టాక్ రిజిస్టర్లు, వైద్య సేవల రికార్డులను తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు.

April 25, 2026 / 05:33 PM IST

అమ్మవారి అన్నదాన కార్యక్రమానికి భక్తుల విరాళం

NTR: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానానికి ఓ కుటుంబం విరాళాన్ని అందజేసింది. విజయవాడ ప్రసాదంపాడు ప్రాంతానికి చెందిన జీ. శేఖర్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు ఆలయ అన్నదాన పథకానికి రూ. 1,01,116 విరాళంగా అందించారు. 

April 25, 2026 / 05:33 PM IST

కాళ్లకూరులోని శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ప్రముఖులు

W.G: కాళ్ల మండలం కాళ్లకూరులోని శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయాన్ని దేవాదాయ ధర్మా దాయశాఖ డిప్యూటీ కమిషనర్ DVL రమేష్ బాబు దర్శించుకున్నారు. శ్రీ స్వామివారి కళ్యాణం మహోత్సవములు సందర్భంగా శ్రీ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆయనతో పాటు ఉప కమిషనర్ V. హరి సూర్య ప్రకాష్, V. వెంకటేశ్వరరావు తదితర ప్రముఖులు ఉన్నారు. ఆలయ EO వారికి స్వాగతం పలికారు.

April 25, 2026 / 05:31 PM IST

“అమరజీవి – జలధార వాటర్ గ్రిడ్” ద్వారా త్రాగు నీరు సరఫరా

కోనసీమ: రాజోలు మండలం శివకోటి గ్రామంలో “అమరజీవి – జలధార వాటర్ గ్రిడ్” పథకంలో భాగంగా 40 KL సామర్థ్యం గల ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (OHBR), 250 KL సంపు నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించారు. గ్రామ ప్రజలకు శుద్ధమైన తాగునీరు అందించేందుకు ఈ ప్రాజెక్ట్ ఎంతో దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నేతలు పాల్గొన్నారు.

April 25, 2026 / 05:30 PM IST

అంతర్జాతీయ క్రీడా వేదికపై బాపట్ల పోలీసుల సత్తా

BPT: థాయ్‌లాండ్‌లో జరిగిన వరల్డ్ మాస్టర్స్ స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్–2026 అథ్లెటిక్స్ పోటీల్లో బాపట్ల జిల్లా పోలీస్ సిబ్బంది అద్భుత ప్రతిభ కనబరిచి మొత్తం 5 పతకాలు సాధించారు. ఈ సందర్భంగా బాపట్ల జిల్లా ఎస్పీ బీ. ఉమామహేశ్వర్ విజేతలను అభినందించి, పోలీస్ ప్రధాన కార్యాలయంలో మెడల్స్‌తో ఘనంగా సత్కరించారు.

April 25, 2026 / 05:30 PM IST